ఉరి వేసుకుని వృద్ధుడు ఆత్మహత్య
శంకరపట్నం మండలంలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు
దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.... శంకరపట్నం మండ లంలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన నూనె భూమయ్య(80) అనే వృద్ధుడు గత కొంతకాలంగా నడుము నొప్పితో పాటుగా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. దాంతో బాత్రూమ్లో ధోతితో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య కనకమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కొత్తపల్లి రవి తెలిపాడు.