నాటు తుపాకీతో కాల్పులు: సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసిన పోలీసులు

నాటు తుపాకీతో కాల్పులు జరిపిన కేసులో పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేపట్టారు..

Update: 2024-12-25 14:29 GMT

దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా(Annamaya District) రాయచోటి మండలం కాటిమాయకుంట(Katimayakunta)లో రెండు రోజుల క్రితం సంచార జీవనం సాగించే హనుమంతుతో పాటు మరో వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు నాటు తుపాకీ(Natu Gun)తో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో హనుమంతు మృతి చెందగా మరో వ్యక్తి రమణకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో రమణను ఆస్పత్రికి తరలించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. నలుగురు అనుమానితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నాటు తుపాకులను సీజ్ చేశారు. కాటిమాయకుంట సమీపంలో దేవరగుట్ట వద్ద సీన్ రీకన్ స్ట్రక్షన్(Scene Reconstruction) నిర్వహించారు. ‘‘కాల్పులు ఎలా, ఎందుకు జరిపారు..?. అసలు నాటు తుపాకులు ఎక్కడివి..?, కాల్పులు జరిగిన రోజు ఎవరెవరు?, ఎక్కడెక్కడ ఉన్నారు, ఎన్ని రౌండ్లు కాల్చారు.?’’ కోణంలో రీ కన్‌స్ట్రక్షన్ చేశారు.


Similar News