కోడిపందాల స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని పినపాక పట్టినగర్, మోరంపల్లిబంజర గ్రామాల శివారులో గల మామిడితోటలో బుధవారం సాయంత్రం కోడి పందాలు నిర్వహిస్తుండగా జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు.

Update: 2024-12-25 14:13 GMT

దిశ,బూర్గంపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని పినపాక పట్టినగర్, మోరంపల్లిబంజర గ్రామాల శివారులో గల మామిడితోటలో బుధవారం సాయంత్రం కోడి పందాలు నిర్వహిస్తుండగా జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో ఆరుగురు వ్యక్తులు, ఆరు ద్విచక్ర వాహనాలు, నాలుగు కోడి పుంజులు, సుమారు రూ.10 వేల నగదు దొరికినట్టు సమాచారం. ఈ దాడుల్లో జిల్లా టాస్క్​ ఫోర్స్ ఎస్ఐలు ప్రవీణ్, రామారావు, సిబ్బంది పాల్గొన్నారు. 


Similar News