అన్నను దారుణంగా హత్య చేసిన తమ్ముడు..

దిశ, మహేశ్వరం : అన్నను రోకలి బండతో కొట్టి చంపిన ఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మురళి నగర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. సీఐ కృషంరాజు తెలిపిన కథనం ప్రకారం.. కందుకూరు మండలం మురళి నగర్ గ్రామానికి చెందిన వడ్త్యవాత్ బాల్ రామ్ (38)కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య గొరి 8 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. తర్వాత బాల్ రామ్ సరికోండకు చెందిన జయలక్ష్మి ని వివాహం చేసుకొన్నాడు. వీరికి 3 సంవత్సరాల […]

Update: 2021-05-05 08:43 GMT

దిశ, మహేశ్వరం : అన్నను రోకలి బండతో కొట్టి చంపిన ఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మురళి నగర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. సీఐ కృషంరాజు తెలిపిన కథనం ప్రకారం.. కందుకూరు మండలం మురళి నగర్ గ్రామానికి చెందిన వడ్త్యవాత్ బాల్ రామ్ (38)కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య గొరి 8 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. తర్వాత బాల్ రామ్ సరికోండకు చెందిన జయలక్ష్మి ని వివాహం చేసుకొన్నాడు. వీరికి 3 సంవత్సరాల బాలుడు (దేవరాజ్) ఉన్నాడు. ఈ నెల 2వ తేదీన బాల్ రామ్ మద్యం తాగి వచ్చి భార్య, పిల్లలను ఇంట్లో ఉండోదాన్ని గొడవ చేశాడు.

దీంతో గ్రామ సమీపన ఉన్న పల్లె ప్రకృతి వణంలోనే జయలక్ష్మి పిల్లలతో కలిసి సాయంత్రం వరకు ఉండగా.. రాత్రి తన తోడి కోడలు.. వారిని ఇంటికి తీసుకువచ్చింది. అయితే, మంగళవారం జయలక్ష్మి.. తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులతో మాట్లాడానికి బాల్ రామ్‌ను కోరగా.. మంగళవారం సాయంత్రం 7 గంటలకు ఇంటికి వచ్చాడు. భార్యను ఎందుకు కొడుతున్నావని బాల్ రామ్ అత్తమామలు అడగా, అత్త మామలని బూతు మాటలు తిట్టడంతో పాటు.. బాల్ రామ్ సొంత తమ్ముడు వడ్త్య వాత్ మోహన్(36)ను కూడా బూతులు తిడుతూ.. కొట్టడానికి రావడంతో మోహన్ ప్రక్కనే ఉన్న రోకలి బండ తీసుకొని బాల్ రామ్ (అన్న)ను తలపై కొట్టాడు.

దీంతో తలకు బలమైన గాయం కావడంతో వెంటేనే బాల్ రామ్‌ను 108 అంబులెన్స్‌లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం (తెల్లవారుజామున) 2:43 సమయంలో చనిపోయడాని డాక్టర్లు తెలిపారు.

 

Tags:    

Similar News