ప్రాణం మీదికొచ్చిన గొడవ.. క్షణికావేశంలో అన్న గొంతు కోసిన తమ్ముడు

దిశ, నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ కాస్త ప్రాణాల మీదికి తెచ్చింది. స్థానికుల వివరాల ప్రకారం.. బర్దిపూర్ గ్రామానికి చెందిన షేక్ మతిన్ కుటుంబంలో గతకొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి అన్నదమ్ముల మధ్య తీవ్ర గొడవతో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో క్షణికావేశానికి గురైన తమ్ముడు ఫాయాజ్ కత్తితో అన్న మతిన్‌ గొంతు కోశాడు. […]

Update: 2021-10-24 22:21 GMT

దిశ, నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ కాస్త ప్రాణాల మీదికి తెచ్చింది. స్థానికుల వివరాల ప్రకారం.. బర్దిపూర్ గ్రామానికి చెందిన షేక్ మతిన్ కుటుంబంలో గతకొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి అన్నదమ్ముల మధ్య తీవ్ర గొడవతో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో క్షణికావేశానికి గురైన తమ్ముడు ఫాయాజ్ కత్తితో అన్న మతిన్‌ గొంతు కోశాడు.

దీంతో తీవ్ర గాయాలపాలైన మతిన్‌ను హుటాహుటిన అర్ధరాత్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గతకొన్ని రోజుల నుండి మధ్య అన్నదమ్ముల మధ్య గొడవ జరుగుతుందని స్థానికులు తెలిపారు. చినుకు చినుకు మారి గాలివానలా తయారై గొడవ కాస్త ప్రాణాల మీదికి తెచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతం మతిన్‌కు చికిత్స జరుగుతోందని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటన‌పై పోలీసులకు ఎలాంటి సమాచారం అందలేదని ఎస్ఐ ఆంజనేయులు సోమవారం ఉదయం తెలిపారు.

Tags:    

Similar News