కరవు అనే పదాన్ని డిక్షనరీ నుంచి తొలగించాం : మంత్రి హరీశ్‌రావు
దిశ సిద్దిపేట: కరువు అనే పదాన్ని డిక్షనరీ నుంచి తెలంగాణ ప్రభుత్వం తొలగించిందన్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల జయంతి సందర్భంగా సిద్ధిపేట జిల్లా గ్రంథాలయంలో వేముగంటి నర్సింహాచార్యుల చిత్రపటానికి నివాళులు అర్పించి, విపంచి ఆడిటోరియంలో జయంతి ఉత్సవాలను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, రాష్ట్ర గ్రంథాలయ అధ్యక్షుడు ఆయాచితం శ్రీధర్, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, బహుభాషా […]
దిశ సిద్దిపేట: కరువు అనే పదాన్ని డిక్షనరీ నుంచి తెలంగాణ ప్రభుత్వం తొలగించిందన్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల జయంతి సందర్భంగా సిద్ధిపేట జిల్లా గ్రంథాలయంలో వేముగంటి నర్సింహాచార్యుల చిత్రపటానికి నివాళులు అర్పించి, విపంచి ఆడిటోరియంలో జయంతి ఉత్సవాలను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, రాష్ట్ర గ్రంథాలయ అధ్యక్షుడు ఆయాచితం శ్రీధర్, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, బహుభాషా వేత్త నలిమెల భాస్కర్, బీవారేజెస్ కార్పోరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, జిల్లా వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షుడు రంగాచారి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలసాయిరాం, ఆర్డీవో అనంతరెడ్డి, ఇతర ప్రముఖులు తదితరులు హాజరయ్యారు. ఈ మేరకు జిల్లా గ్రంథాలయ అభివృద్ధికై శాశ్వత సభ్యత్వం పొందిన సభ్యులకు సభ్యత్వ కార్డులను మంత్రి చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ కోటి రతనాల వీణ అని నాడు దాశరథి అంటే, నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా కోటి 25 లక్షల ఎకరాలకు పంట పండించే దిశగా సీఎం కేసీఆర్ మార్చారు అని మంత్రి పేర్కొన్నారు. 3 కోట్ల మెట్రిక్ ధాన్యం పండించి, దేశంలోనే అత్యధిక ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర పుటల్లో నిలిచిందన్నారు. అన్నీ వర్గాలకు సముచిత స్థానం కల్పించేలా దళిత బంధు అనే కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ తెచ్చారు అని అన్నారు. నాడు కరువు ప్రాంతంగా ఉన్న తెలంగాణలో నేడు పసిడి పంటలు పండుతున్నాయన్నారు. 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి దేశంలో మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు. 50 వేల ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు.
ఇక నుంచి ప్రతి ఏడాది ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు అని తెలిపారు. ఇప్పటి వరకు 1 లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, అవసరం మేరకు రాష్ట్రంలో 64 వేల ఉద్యోగాలు సృష్టించాం అని అన్నారు. ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నందున రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలను అందుబాటులో ఉంచాలని, అందుకు అవసరమైన సంపూర్ణ సహకారం ఆర్థిక శాఖ తరపున అందిస్తామని మంత్రి అన్నారు.