టార్చర్ చేస్తున్న భర్త.. తలాక్ చెప్పిన భార్య
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్‌లో ఎంత రచ్చ జరిగినా… ట్రిపుల్ తలాక్ బిల్లు చట్ట విరుద్దమైనా కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావడంతో దేశంలో ఇన్ స్టంట్ తలాక్‌లు చెప్పి, సంబంధాలను తెంచుకుంటున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయి. తాజాగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ మహిళ భర్తకు తలాక్ చెప్పి వెళ్లిపోయింది. వివరాళ్లోకి వెళితే… వెలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే షేర్ఖాన్ పఠాన్.. భార్య ముమ్తాజ్ షేక్‌ను రోజూ అనేక ఇబ్బందులకు గురిచేస్తూ, చిత్రహింసలు పెట్టేవాడు. దాంతో విసుగుచెందిన భార్య […]
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్‌లో ఎంత రచ్చ జరిగినా… ట్రిపుల్ తలాక్ బిల్లు చట్ట విరుద్దమైనా కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావడంతో దేశంలో ఇన్ స్టంట్ తలాక్‌లు చెప్పి, సంబంధాలను తెంచుకుంటున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయి. తాజాగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ మహిళ భర్తకు తలాక్ చెప్పి వెళ్లిపోయింది. వివరాళ్లోకి వెళితే…
వెలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే షేర్ఖాన్ పఠాన్.. భార్య ముమ్తాజ్ షేక్‌ను రోజూ అనేక ఇబ్బందులకు గురిచేస్తూ, చిత్రహింసలు పెట్టేవాడు. దాంతో విసుగుచెందిన భార్య ముమ్తాజా.. తన ముగ్గురు పిల్లలను తీసుకుని అమ్మగారింటికి వెళ్లిపోయింది. తనను తీసుకెళ్లేందుకు వచ్చిన భర్తకు ట్రిపుల్ తలాక్ చెప్పేసింది. దాంతో తనపై భార్య తండ్రి దాడికి పాల్పడ్డాడంటూ పఠాన్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు తనను తీవ్రంగా హింసలకు గురిచేసేవాడంటూ అహ్మదాబాద్‌లో భర్తపై గృహ హింస చట్టం కింద ఫిర్యాదు చేసింది. అయితే ‘‘ఈ తలాక్ మన దేశ చట్టాల ప్రకారం… లేదా ఇస్లామిక్ కోడ్ కింద చట్టబద్ధమైనదిగా పరిగణించబడదు. అయినా, ఆమె కుటుంబం దీనిని విడాకులుగా భావించారు’’ అని వెలాపూర్ పోలీసు ఇన్స్పెక్టర్ ఎల్డి ఒడెడారా చెప్పారు. చట్టం వచ్చినప్పటికీ ట్రిపుల్ తలాక్ లు ఇంకా కొనసాగుతుండటం పట్ల పలువురు జాతీయవాదులు విచారం వ్యక్తం చేస్తున్నారు.