అబ్బో ఆ భార్య మహానటి.. భర్తను అలా చేయాలనుకుని.. తనే చేసేసింది!
దిశ, వెబ్ డెస్క్: సినిమాలను చూసి యువత ఎంత చెడిపోతున్నారో తెలియదు కానీ సీరియల్స్ ని చూసి మాత్రం మహిళలు కర్కశంగా తయారవుతున్నారు. అనుమానాలు, పగలు, ప్రతీకారాలు అంటూ ఇంట్లో వారిని వేధించడం చాలా చూస్తూనే ఉన్నాం. అయితే ఒక మహిళ ఇంకాస్త ముందుకు వెళ్లి సీరియల్ లో చూపించినట్లు భర్తను ఇరికించడానికి పక్కా ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ రివర్స్ అవ్వడంతో జైల్లో ఊచలు లెక్కేస్తుంది. వివరాలలోకి వెళితే ఉత్తరప్రదేశ్లోని ఎస్జీఎం నగర్లో ఒక ఆటో […]
దిశ, వెబ్ డెస్క్: సినిమాలను చూసి యువత ఎంత చెడిపోతున్నారో తెలియదు కానీ సీరియల్స్ ని చూసి మాత్రం మహిళలు కర్కశంగా తయారవుతున్నారు. అనుమానాలు, పగలు, ప్రతీకారాలు అంటూ ఇంట్లో వారిని వేధించడం చాలా చూస్తూనే ఉన్నాం. అయితే ఒక మహిళ ఇంకాస్త ముందుకు వెళ్లి సీరియల్ లో చూపించినట్లు భర్తను ఇరికించడానికి పక్కా ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ రివర్స్ అవ్వడంతో జైల్లో ఊచలు లెక్కేస్తుంది. వివరాలలోకి వెళితే ఉత్తరప్రదేశ్లోని ఎస్జీఎం నగర్లో ఒక ఆటో డ్రైవర్, భార్యతో కలిసి నివసిస్తున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా భర్త ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడని భార్యలో అనుమానం మొదలయ్యింది. ఎందుకు లేటుగా వస్తున్నాడు అని కనుక్కోవాలనుకుంది. ఈ నేపథ్యంలోనే భర్తతో రోజూ గొడవకు దిగేది. భర్త వేరే అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానించింది.
తనను మోసం చేసిన భర్త జైల్లో ఊచలు లెక్కించేలా చేయాలని అనుకుంది. అనుకున్నదే తడవుగా ఒక భారీ స్కెచ్ రెడీ చేసింది. ఎవరికి తెలియకుండా ఢిల్లీకి వెళ్లి పవన్ అనే వ్యక్తి వద్ద సుమారు 700 గ్రాముల గంజాయి మొక్కను కొనుగోలు చేసింది. ఆ మొక్కను భర్త ఆటోలో పెట్టింది. ఏమి తెలియని దానిలా గొంతు మార్చి పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఆటో డ్రైవర్ ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టగా భార్య ప్లాన్ బయటపడింది. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు మహిళను అరెస్ట్ చేశారు.