వందేళ్లకో జబ్బు.. కరోనాయేనా?.. ఇంకేదైనా ఉందా?
కరోనా వైరస్ ప్రపంచాన్న వణికిస్తున్న సంగతి తెలిసిందే. చైనాలో ఇప్పటి వరకు ఈ వ్యాధి బారిన పడి సుమారు 900 మందికిపైగా మృతి చెందారని గణాంకాలు చెబుతున్నాయి. విదేశాల్లో కూడా ఈ వ్యాధి కనిపించినప్పటికీ అక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలో మరణాలు సంభవించకపోవడం కాస్త ఉపశమనం కలిగించే అంశం. అయితే ప్రతి వందేళ్లోకోసారి ప్రపంచాన్ని ఏదో ఒక రుగ్మత ప్రబలి ప్రపంచ జనాభాను ఆందోళనలోకి నెట్టేస్తోంది. ఈసారి […]
కరోనా వైరస్ ప్రపంచాన్న వణికిస్తున్న సంగతి తెలిసిందే. చైనాలో ఇప్పటి వరకు ఈ వ్యాధి బారిన పడి సుమారు 900 మందికిపైగా మృతి చెందారని గణాంకాలు చెబుతున్నాయి. విదేశాల్లో కూడా ఈ వ్యాధి కనిపించినప్పటికీ అక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలో మరణాలు సంభవించకపోవడం కాస్త ఉపశమనం కలిగించే అంశం.
అయితే ప్రతి వందేళ్లోకోసారి ప్రపంచాన్ని ఏదో ఒక రుగ్మత ప్రబలి ప్రపంచ జనాభాను ఆందోళనలోకి నెట్టేస్తోంది. ఈసారి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్టే వందేళ్ల క్రితం స్పానిష్ ఫ్లూ, అంతకు వందేళ్ల క్రితం కలరా, అంతకు వందేళ్ల క్రితం ప్లేగు సంభవించి వందలమంది ప్రాణాలను హరించివేశాయి.
1720లో ది గ్రేట్ ప్లేగ్ ఆఫ్ మార్సిల్లే (ప్లేగు) వ్యాధి ప్రబలింది. ఫ్రాన్స్‌లోని మార్సిల్లో నగరంలో సుమారు లక్షమంది ఈ వ్యాధి కారణంగా మృత్యువాతపడ్డారు. భారత్‌లో కూడా ప్లేగు కారణంగా భారీ సంఖ్యలో మృతిచెందారు. హైదరాబాదులో ప్లేగు వ్యాధిని నియంత్రించలేక నైజాం ప్రభుత్వం తల్లడిల్లినట్టు చరిత్ర చెబుతోంది. దీనికి గుర్తుగానే చార్మినార్‌ను నిర్మించినట్టు కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి.
1820లో కలరా సృష్టించిన కల్లోలం అంతాఇంతాకాదు. ఆసియాలోని థాయ్‌లాండ్ దేశంలో తొలిసారి దీనిని గుర్తించారు. ఆ తరువాత ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, అక్కడి నుంచి వివిధ దేశాలకు ఇది ప్రాకిపోయింది. దీని ధాటికి సుమారు లక్ష మంది మరణించారని తెలుస్తోంది. బాక్టీరియా కారణంగా కలుషితమైన సరస్సుల్లోని నీటిని తాగడం వల్ల కలరా వ్యాప్తి చెందుతుందని తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో కలరా వ్యాధి వైద్యసదుపాయాలు లేని అభాగ్యులను పొట్టన పెట్టుకునేది.
1920లో స్పానిష్ ఫ్లూ మానవ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన రుగ్మతగా నిలిచిపోయింది. ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 కోట్ల మందికి ఈ వ్యాధి సోకిందంటే దీని వ్యాప్తి ఎంత వేగంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. వ్యాధి సోకిన 50 కోట్ల మందిలో 10 కోట్ల మందిని ఇది బలిగొంది. దీంతో ఇది మానవ చరిత్రలోనే అత్యంత ప్రాణాతకమైన వ్యాధిగా నిలిచిపోయింది.
2020లో కరోనా వైరస్ ఆ వ్యాధుల తరహాలోనే వేగంగా వ్యాప్తి చెందుతోంది. చైనాలోని వూహాన్ నగరం కేంద్రంగా వ్యాపించిన ఈ కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే ఈ వ్యాధి వందల మందిని బలిగొంది. అంతే కాకుండా 27 దేశాలకు వ్యాపించింది. అయితే విదేశాల్లో పెద్దగా ప్రభావం చూపని కరోనా చైనాను మాత్రం వణికిస్తోంది. చైనా తరువాత అమెరికాలోనే ఈ వ్యాధి ప్రభావం చూపినట్టు తెలుస్తోంది.
కాగా, కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కరోనా గురించి ముందుగానే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆ హెచ్చరికలో కోటి మందికి పైగా అని ఆయన హెచ్చరించడంతో ఈ వ్యాధి ఏఏ దేశాల్లో ఎంతమందిని తనతో తీసుకెళ్తుందోనని ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి. మరికొందరు ఈ శతాబ్దానికి కరోనాయేనా ఇంకా ఏవైనా ప్రాణాంతక వ్యాధులు మానవాళిపై దాడిచేసే ప్రమాదముందా? అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.