రాష్ట్ర కేబినెట్‌లో ఉన్నది ఉద్యమ ద్రోహులు.. గాదె ఇన్నారెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌లో ఉన్నది ఉద్యమ ద్రోహులని, వారు పార్టీ కండువా వేసుకునేందుకు కూడా అనర్హులని టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు గాదె ఇన్నారెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఉన్నా మంత్రులు, ఎమ్మెల్యేలు కేసీఆర్మెప్పు కోసం కొంగ జపం చేస్తున్నారని, వారికి తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలియదని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏ ఒక్క తెలంగాణ ఉద్యమకారుడు కూడా బాగుపడలేదనీ, స్వరాష్ట్ర ఫలాలు […]
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌లో ఉన్నది ఉద్యమ ద్రోహులని, వారు పార్టీ కండువా వేసుకునేందుకు కూడా అనర్హులని టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు గాదె ఇన్నారెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఉన్నా మంత్రులు, ఎమ్మెల్యేలు కేసీఆర్మెప్పు కోసం కొంగ జపం చేస్తున్నారని, వారికి తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలియదని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏ ఒక్క తెలంగాణ ఉద్యమకారుడు కూడా బాగుపడలేదనీ, స్వరాష్ట్ర ఫలాలు ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారులకే దక్కుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
2001 జల దృశ్యం ఫోటోలో ఉన్నవారికే టీఆర్ఎస్ పార్టీ మీద హక్కు ఉందని, వారే ఆ పార్టీ కండువా వేసుకోవడానికి నిజమైన అర్హులని అందులో స్పష్టం చేశారు. యువత, నిరుద్యోగులు ఎవరు కూడా నిరుత్సాహానికి గురై ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే అందరు కోరుకున్నా బతుకు తెలంగాణ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.