Allu Arjun: క్షణక్షణం ఉత్కంఠ.. చిక్కడపల్లి పీఎస్‌కు చేరుకున్న అల్లు అర్జున్

సంధ్య థియేటర్ (Sandhya Theatre) తొక్కిసలాట (Stampede) ఘటన కేసులో ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ సోమవారం పోలీసులు అల్లు అర్జున్‌ (Allu Arjun)కు నోటీసులు జారీ చేశారు.

Update: 2024-12-24 05:37 GMT
Allu Arjun: క్షణక్షణం ఉత్కంఠ.. చిక్కడపల్లి పీఎస్‌కు చేరుకున్న అల్లు అర్జున్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: సంధ్య థియేటర్ (Sandhya Theatre) తొక్కిసలాట (Stampede) ఘటన కేసులో ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ సోమవారం పోలీసులు అల్లు అర్జున్‌ (Allu Arjun)కు నోటీసులు జారీ చేశారు. ఈ తరుణంలోనే కాసేపటి క్రితం ఆయన కారులో చిక్కడపల్లి పీఎస్‌కు చేరుకున్నారు. ఆయన వెంట లీగల్ టీం (Legal Team), తండ్రి అల్లు అరవింద్ (Allu Aravind), మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి (Kancharla Chandrashekar Reddy) ఉన్నారు. డిసెంబర్ 4న సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్‌ (Allu Arjun)ను ఏసీపీ రమేష్ (ACP Ramesh), సీఐ రాజు (CI Raju) దాదాపు 2 గంటల పాటు ప్రశ్నించనున్నారు. అదేవిధంగా ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ (Chikkadpally Police Station) వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ (Allu Arjun) తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి (Ashok Reddy) మాట్లాడుతూ.. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించారు. 

Tags:    

Similar News