Tragedy: నగర శివారులో ఘోరం.. గోనెసంచిలో డెడ్‌బాడీ కలకలం..!

గోనె సంచిలో మృతదేహం కలకలం రేపిన ఘటన రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) పరిధిలోని మైలార్‌దేవ్‌‌పల్లి (Mailardevpally)లో చోటుచేసుకుంది.

Update: 2024-12-24 04:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: గోనె సంచిలో మృతదేహం కలకలం రేపిన ఘటన రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) పరిధిలోని మైలార్‌దేవ్‌‌పల్లి (Mailardevpally)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇవాళ ఉదయం జీహెచ్ఎంసీ (GHMC) పారిశుధ్య కార్మికులు రోడ్డుపై ఓ గోనె సంచిని గమనించారు. అయితే, అందులో ఏముందని తెరిచి చూడగా.. డెడ్‌బాడీ (Dead Body)ని చూసి వారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ క్రమంలోనే వారు డయల్ 100‌కు ఫోన్ చేశారు. అనంతరం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. గోనె సంచిని రోడ్డుపై ఎవరు వదిలి వెళ్లారు, హత్యకు గల కారణాలు ఏంటి అనే కోణంలో వారు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News