గ్రామశివారుకు మైనర్ బాలికను ఆ ముగ్గురు తీసుకెళ్లి …

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఓ మైనర్ బాలికపై ముగ్గురు మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని ఓ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి మైనర్ బాలురు లను అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో 14 ఏళ్ల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన ముగ్గురు మైనర్ బాలురులు గ్రామ శివారులోకి తీసుకెళ్లి సామూహిక హత్యాచారానికి ఒడిగట్టారు. అత్యాచారానికి గురైన […]

Update: 2021-06-23 07:57 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఓ మైనర్ బాలికపై ముగ్గురు మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని ఓ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి మైనర్ బాలురు లను అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో 14 ఏళ్ల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన ముగ్గురు మైనర్ బాలురులు గ్రామ శివారులోకి తీసుకెళ్లి సామూహిక హత్యాచారానికి ఒడిగట్టారు.

అత్యాచారానికి గురైన బాలిక ఐదు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు బాలికను చికిత్స నిమిత్తం బోధన్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి బాలికపై హత్యచారం జరిగినట్లు వెల్లడించడంతో బాధితురాలి తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించగా ముగ్గురు తనపై సామూహికంగా హత్యచారానికి పాల్పడినట్లు తెలిపింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు కోటగిరి పోలీసులను ఆశ్రయించారు. రుద్రూర్ ఎస్సై రవీందర్ ఈ విషయంపై విచారణ జరిపి ముగ్గురు బాలురలను అదుపులోకి తీసుకొని, పోక్సో చట్టం కింద కేసును నమోదు చేశారు.

ఆ చిన్నారులకు కరోనా ముప్పు తక్కువంటా..!

Tags:    

Similar News