టీకాతో మరణం ముప్పు దాదాపు శూన్యం- కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: కరోనా మరణాలతో పోల్చితే టీకా వల్ల మరణం ముప్పు దాదాపు శూన్యమని, దాన్ని ఉపేక్షించవచ్చునని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జనవరి 16 నుంచి జూన్ 7వ తేదీ మధ్యలో టీకా తీసుకుని 488 మంది మరణించారన్న మీడియా కథనాలను కొట్టిపారేసింది. ఆ కాలంలో 23.5 కోట్ల డోసులను పంపిణీ చేశామని వివరించింది. వాటితో పోల్చితే టీకా తీసుకున్నవారిలో మరణించింది 0.0002 శాతమని వివరించింది. కానీ, వీరంతా టీకా తీసుకుని వికటించిన కారణంగా మరణించారనుకోవడం తప్పని పేర్కొంది. […]
న్యూఢిల్లీ: కరోనా మరణాలతో పోల్చితే టీకా వల్ల మరణం ముప్పు దాదాపు శూన్యమని, దాన్ని ఉపేక్షించవచ్చునని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జనవరి 16 నుంచి జూన్ 7వ తేదీ మధ్యలో టీకా తీసుకుని 488 మంది మరణించారన్న మీడియా కథనాలను కొట్టిపారేసింది. ఆ కాలంలో 23.5 కోట్ల డోసులను పంపిణీ చేశామని వివరించింది. వాటితో పోల్చితే టీకా తీసుకున్నవారిలో మరణించింది 0.0002 శాతమని వివరించింది. కానీ, వీరంతా టీకా తీసుకుని వికటించిన కారణంగా మరణించారనుకోవడం తప్పని పేర్కొంది. ఆ స్థాయి జనాభాలో అన్ని మరణాలు సంభవించడం సాధారణమేనని తెలిపింది.
శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ డేటా ప్రకారం, 2017లో ప్రతి వెయ్యి మందిలో ఏడాదికి 6.3 శాతం మరణించారని వివరించింది. టీకా పాజిటివ్ తేలిన వారిలో ఈ రేటుతో పోల్చితే మరణాలు ఒక శాతం ఎక్కువగా చోటుచేసుకున్నట్టు తెలుస్తున్నదని, అందులో ఆ ఒక్క శాతాన్ని టీకా పంపిణీ ద్వారా నివారించవచ్చునని తెలిపింది. మీడిమా కథనాల్లో వాస్తవం లేదని, టీకా తీసుకున్నంత మాత్రానా అనంతరం మరణించిన వారంతా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్‌తో మరణించారని పేర్కొనరాదని వివరించింది.