ఖమ్మంలో ఆ మంత్రి ఏమన్నారంటే..?
దిశ, ఖమ్మం: ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని రవాణాశాఖ మంత్రి అజయ్‌కుమార్ అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా బోనకల్ గ్రామంలో చింతకాని మండలం లచ్చగూడెం గ్రామంలో రైతు బంధు వేదిక భవనం పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నడు లేని విధంగా కేసీఆర్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందజేస్తోందని తెలిపారు. నాణ్యమైన వ్యవసాయమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలను ఆరంభించిందన్నారు. ఈ […]
దిశ, ఖమ్మం: ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని రవాణాశాఖ మంత్రి అజయ్‌కుమార్ అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా బోనకల్ గ్రామంలో చింతకాని మండలం లచ్చగూడెం గ్రామంలో రైతు బంధు వేదిక భవనం పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నడు లేని విధంగా కేసీఆర్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందజేస్తోందని తెలిపారు. నాణ్యమైన వ్యవసాయమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలను ఆరంభించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, కలెక్టర్ కర్ణన్, రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వర రావు, జిల్లా వ్యవసాయ అధికారి ఝాన్సీ లక్ష్మీ కుమారి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.