సాంస్కృతిక వైభవాన్ని కాపాడుకుందాం : మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

దిశ,వనపర్తి :  వనపర్తి ప్రాంత సాంస్కృతిక వైభవాన్ని కాపాడుకుందామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం  వనపర్తి బాల కేంద్రంను బాల భవన్ గా అప్ గ్రేడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  వనపర్తి ప్రాంతం చదువులకు, కవులకు, కళలకు, కళాకారులకు పుట్టినిల్లుగా పేరుగాంచింది, ఇక్కడి సాహితీకారులు, కవులు, కళాకారులూ ప్రాంత సాంస్కృతిక […]

Update: 2021-12-01 04:19 GMT

దిశ,వనపర్తి : వనపర్తి ప్రాంత సాంస్కృతిక వైభవాన్ని కాపాడుకుందామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం వనపర్తి బాల కేంద్రంను బాల భవన్ గా అప్ గ్రేడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వనపర్తి ప్రాంతం చదువులకు, కవులకు, కళలకు, కళాకారులకు పుట్టినిల్లుగా పేరుగాంచింది, ఇక్కడి సాహితీకారులు, కవులు, కళాకారులూ ప్రాంత సాంస్కృతిక వైభవాన్ని కాపాడుకునేందుకు కృషి చేయాలన్నారు.

బాల్య దశలోనే బాలలలో ఉన్న ప్రతిభను వెలికి తీసే బాధ్యత బాల కేంద్రం పై ఉందన్నారు. బాల కేంద్రం, సాహితీ సభ్యుల కోరిక మేరకు ఇచ్చిన మాట ప్రకారం బాల కేంద్రాన్ని బాల భవన్‌గా మారుస్తూ ప్రభుత్వం నుంచి అనుమతి తేవడం జరిగిందనీ మంత్రి గుర్తు చేశారు. ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. బాల కేంద్రం ను బాల భవన్ గా అప్డేట్ చేసేందుకు చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కి సాహితీ సభ్యులు,బాల కేంద్రం పర్యవేక్షకులు కృతజ్ఞతలు తెలిపారు.బాల భవన్ పర్యవేక్షకులు లావణ్య,నృత్య,చిత్ర లేకనం,టైలరింగ్ ఉపధ్యాయులు ప్రసన్న,నిరీష,సాజిదా అటెండర్ వాజీద్ పాల్గొన్నారు. అదేవిధంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని రంగా టాకీస్‌లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రైతన్న చలన చిత్రం‌ను చిత్ర దర్శకుడు,నిర్మాత ఆర్ నారాయణ మూర్తి‌తో కలిసి విక్షించారు.

Tags:    

Similar News