కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ధ్యేయంగా 2009 నవంబర్ 29
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ధ్యేయంగా 2009 నవంబర్ 29 న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష తోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్,బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి లు అన్నారు.ఈ నెల 29 న జరుపతలపెట్టిన దీక్షా దివస్ కార్యక్రమం సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో వారు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ క్యామ మల్లేష్ లతో కలిసి ప్రసంగించారు.
కేసీఆర్ ఆమరణదీక్ష తో తెలంగాణ సమాజం ఏకతాటిపైకి తెచ్చి,కేంద్రం మెడలు వంచి రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ మొదలు పెట్టి రాష్ట్ర ఏర్పాటైయ్యిందని,కేసీఆర్ లేకపోతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లేదని వారు అన్నారు.ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ ఈ నెల 29 న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 'దీక్షా దివస్' కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలిపారు.ఈ సమావేశంలో నాయకులు రాజేశ్వర్ గౌడ్,ఇంతియాజ్,గంజి వెంకన్న,వాల్యా నాయక్,యాదయ్య,కెసీనర్సింహులు,బస్వరాజు,సత్యనారాయణ,ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.