గురుకులాల విద్యార్థుల మరణాలు ప్రభుత్వ చెవికి పట్టవా..: మాజీ మంత్రి
గురుకుల పాఠశాల విద్యార్థులు రోజురోజుకు మరణాలకు గురవుతున్న
దిశ, వనపర్తి టౌన్: గురుకుల పాఠశాల విద్యార్థులు రోజురోజుకు మరణాలకు గురవుతున్న ప్రభుత్వానికి పట్టడం లేదని, పెడచెవిన పెట్టి వ్యవస్థ నడుపుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం తన నివాసంలో ఒక ప్రకటనలో మాట్లాడుతూ... గురుకుల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ వల్ల రోజుకు గురుకుల పాఠశాలలో అస్వస్థకు గురై మరణిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతుందని ఆయన మండిపడ్డారు. అయినా ప్రభుత్వం తీరు మార్చకుండా ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్న పట్ల మాజీ మంత్రి తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 20 రోజులుగా పైగా చికిత్స పొందుతూ నిన్ననే గురుకుల విద్యార్థిని శైలజ అందించడం చాలా బాధాకరమని ఆయన అన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ జరిగి ప్రభుత్వ ఆసుపత్రి 30 మందికి పైగా చేరి సంగతి అందరికి తెలిసిందే అన్నారు . ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్లే ఈ సంఘటనలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఏడాది కావస్తున్న విద్యాశాఖ, హోంశాఖ, మున్సిపల్ శాఖ మంత్రులు నియామకానికి దిక్కులేని పరిస్థితిలో రేవంత్ సర్కారు ఉందని ఎద్దేవా చేశారు. మంత్రి లేక దారి తప్పుతున్న గురుకుల పాఠశాల విద్యా వ్యవస్థ ప్రభుత్వంలో అనేక శాఖల మీద పర్యవేక్షణ లేకపోవడం మూలంగానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్లు ఆయన ఆరోపించారు. విద్యార్థులకు తల్లిదండ్రులకు భద్రత భరోసా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.