ఆయువు తీసిన ఆవేశం.. కన్నతండ్రిని కడతేర్చిన కొడుకు

దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం సేవించి రోజూ ఇంట్లో గొడవలకు పాల్పడుతున్నాడని ఓ కుమారుడు కన్నతండ్రిని కడతేర్చాడు. ఈ ఘటన నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చర్లపల్లిలో గురువారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మందడి బుచ్చిరెడ్డి(57) గురువారం సాయంత్రం మద్యం సేవించి ఇంటికొచ్చి కుటుంబ సభ్యులతో గొడవ పడటం ప్రారంభించారు. ఇంట్లో గొడవ చేయొద్దని అతడి చిన్న కుమారుడు […]

Update: 2021-08-13 11:21 GMT

దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం సేవించి రోజూ ఇంట్లో గొడవలకు పాల్పడుతున్నాడని ఓ కుమారుడు కన్నతండ్రిని కడతేర్చాడు. ఈ ఘటన నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చర్లపల్లిలో గురువారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మందడి బుచ్చిరెడ్డి(57) గురువారం సాయంత్రం మద్యం సేవించి ఇంటికొచ్చి కుటుంబ సభ్యులతో గొడవ పడటం ప్రారంభించారు. ఇంట్లో గొడవ చేయొద్దని అతడి చిన్న కుమారుడు సురేష్ రెడ్డి ఎంత నచ్చజెప్పినా బుచ్చిరెడ్డి వినలేదు. దీంతో ఇరువురి మధ్య మాటలు పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన సురేష్ రెడ్డి ప్లాస్టిక్ కుర్చితో తండ్రి తలపై, శరీరంపై బలంగా కొట్టగా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే బుచ్చిరెడ్డిని నల్లగొండలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తుండగానే పరిస్థితి విషమించి మృతిచెందాడు. మృతుడి భార్య సునంధ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.

Tags:    

Similar News