దారుణం.. తల్లిని చంపి నిద్రపోయిన కొడుకు

దిశ, చేవెళ్ల: కన్న తల్లి తలపై బండరాయితో కొట్టి అత్యంత దారుణంగా చంపేశాడు కొడుకు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కుమ్మేర గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండల పరిధిలోని కుమ్మేర గ్రామానికి చెందిన పాపమ్మ(63)కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు పోచయ్య గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్‎గా పని చేస్తున్నాడు. చిన్న కొడుకు కిష్టయ్య మేస్త్రి దగ్గర కూలీ పని చేస్తున్నాడు. పాపమ్మ చిన్న కుమారుడు […]

Update: 2021-08-10 10:47 GMT

దిశ, చేవెళ్ల: కన్న తల్లి తలపై బండరాయితో కొట్టి అత్యంత దారుణంగా చంపేశాడు కొడుకు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కుమ్మేర గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండల పరిధిలోని కుమ్మేర గ్రామానికి చెందిన పాపమ్మ(63)కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు పోచయ్య గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్‎గా పని చేస్తున్నాడు. చిన్న కొడుకు కిష్టయ్య మేస్త్రి దగ్గర కూలీ పని చేస్తున్నాడు. పాపమ్మ చిన్న కుమారుడు కిష్టయ్య దగ్గర ఉంటూ జీవనం సాగిస్తుంది. కిష్టయ్య మద్యానికి బానిసై ప్రతిరోజు మద్యం తాగి ఇంటికి వెళ్ళేవాడు. సోమవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వెళ్లడంతో తల్లి పాపమ్మ కొడుకు కిష్టయ్యతో గొడవ పడింది. మద్యం మైకంలో ఉన్న కొడుకు తల్లి తలపై బండరాయితో బలంగా మోదడంతో పాపమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మరుసటి రోజు ఉదయమైనా తల్లి ఇంకా నిద్ర లేవలేదని పెద్ద కొడుకు ఇంటికెళ్లి చూడగా రక్తపు గాయాలతో తల్లి చనిపోయి ఉన్నది. మద్యం మత్తులో కిష్టయ్య నిద్రలో ఉన్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకొని.. నేరం ఒప్పుకున్న నిందితుడి(కిష్టయ్య)ని అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News