అత్తను హత్య చేసిన అల్లుడు.. కారణం అదే?
దిశ, కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కోనాపూర్ గ్రామం లో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జడ రాజవ్వ అనే మహిళను ఆమె అల్లుడు కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామానికి చెందిన అమరకొండ గంగాధర్ కిరతకంగా తలపై మోది చంపాడు. రాజవ్వ భర్త, కుమారుడు గతంలోనే అనారోగ్య కారణాలతో మరణించగా, రాజవ్వ ఇద్దరు కుమార్తెలకు వివాహం చేసి ఒంటరిగా జీవిస్తుంది. రాజవ్వ చిన్న కూతురును మేనల్లుడైన గంగాధర్ కు ఇచ్చి వివాహం జరిపించిగా కొద్ది రోజులుగా బాగానే […]
దిశ, కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కోనాపూర్ గ్రామం లో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జడ రాజవ్వ అనే మహిళను ఆమె అల్లుడు కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామానికి చెందిన అమరకొండ గంగాధర్ కిరతకంగా తలపై మోది చంపాడు. రాజవ్వ భర్త, కుమారుడు గతంలోనే అనారోగ్య కారణాలతో మరణించగా, రాజవ్వ ఇద్దరు కుమార్తెలకు వివాహం చేసి ఒంటరిగా జీవిస్తుంది. రాజవ్వ చిన్న కూతురును మేనల్లుడైన గంగాధర్ కు ఇచ్చి వివాహం జరిపించిగా కొద్ది రోజులుగా బాగానే ఉన్న గంగాధర్ ఆస్తి పంచి ఇవ్వాలని పదే పదే అడగడంతో భార్యాభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగేవని, ఇటీవలే గొడవ జరగ్గా రాజవ్వ కూతురిని పుట్టింటికి తీసుకెళ్లిందని బంధువులు తెలిపారు. ఈ క్రమంలోనే తన భార్యను కాపురానికి పంపట్లేదని కోపోద్రిక్తుడైన గంగాధర్ మంగళవారం మధ్యాహ్నం వచ్చి భార్యపై దాడి చేసేందుకు ప్రయత్నించగా అడ్డువచ్చిన అత్తను కర్రతో తలపై కొట్టి చంపాడని స్థానిక పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.