అంతర్వేదిలో టెన్షన్.. టెన్షన్.. 3 కిమీ వెనక్కి వెళ్లిన సముద్రం

దిశ, వెబ్‌డెస్క్ : అంతర్వేదిలో సముద్రం దోబూచులాడుతోంది. గత వారం రోజులుగా ముందుకు చొచ్చుకు వచ్చిన సముద్రం నీరు.. గురువారం ఒక్కసారిగా మూడు కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లింది. దీంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రతి అమావాస్య, పౌర్ణమికి సముద్రం నీరు ముందుకు రావడం ఇక్కడ సహజమే అయినప్పటికీ ప్రస్తుతం కిలో మీటర్ల మేర వెనక్కి పోవడంపై స్థానికులకు భయపడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలో ఉన్న అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామి […]

Update: 2021-08-26 12:28 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అంతర్వేదిలో సముద్రం దోబూచులాడుతోంది. గత వారం రోజులుగా ముందుకు చొచ్చుకు వచ్చిన సముద్రం నీరు.. గురువారం ఒక్కసారిగా మూడు కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లింది. దీంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రతి అమావాస్య, పౌర్ణమికి సముద్రం నీరు ముందుకు రావడం ఇక్కడ సహజమే అయినప్పటికీ ప్రస్తుతం కిలో మీటర్ల మేర వెనక్కి పోవడంపై స్థానికులకు భయపడుతున్నారు.

తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలో ఉన్న అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉన్నాడు. ఇదే ప్రాంతంలో గోదావరి బంగాళఖాతంలో కలిసే సంగమ ప్రదేశం. ఈ కారణంగా ఇక్కడి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి భక్తులు నిత్యం భారీగా తరలివస్తుంటారు. అయితే గత రెండు, మూడు రోజులుగా భారీ అలలతో సముద్రం 45 మీటర్ల మేర ముందుకు రావడంతో భక్తులు ఆందోళన చెందారు. గతంలో ఎప్పుడూ అంతలా ముందుకు రాలేదు. పైగా భారీ అలలు చోటుచేసుకున్నాయి. సముద్ర గర్భంలోనే భూకంపం వచ్చింది. తాజాగా సముద్రం నీరు వెనక్కి వెళ్లింది. ఇలా కేవలం అంతర్వేదిలోనే కాకుండా ఉప్పాడలో కూడా సముద్రం 100 మీటర్ల వెనక్కి వెళ్లింది. దీంతోపాటు సముద్రం నీరు రంగు మారడం, నీరు ముందుకు, వెనక్కి వస్తుండడంతో సునామీ వస్తోందేమోనని స్థానికులు భయ పడుతున్నారు.

Tags:    

Similar News