కేసుల దర్యాప్తులో రైటర్ల పాత్ర కీలకం: సజ్జనార్

దిశ, క్రైమ్ బ్యూరో : నేరాల దర్యాప్తులో విభిన్నమైన రీతిలో సాక్ష్యాల సేకరణ, రిమాండ్ నివేదికలను తయారు చేయడంలో ఇన్వెస్టిగేషన్ అధికారులతో పాటు స్టేషన్ రైటర్స్ పాత్ర ఎంతో కీలకమని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. కేసుల దర్యాప్తు నాణ్యతను మరింత మెరుగుపర్చేందుకు ఐఓలకు రైటర్లు దోహదకారులుగా ఉంటారని ఆయన తెలిపారు. సైబరాబాద్ సీటీసీ ఆధ్వర్యంలో కొత్తగా నియామకమైన కానిస్టేబుల్ అధికారులకు స్టేషన్ రైటర్స్ నైపుణ్యాలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమం సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా సీపీ […]

Update: 2020-12-28 10:57 GMT

దిశ, క్రైమ్ బ్యూరో : నేరాల దర్యాప్తులో విభిన్నమైన రీతిలో సాక్ష్యాల సేకరణ, రిమాండ్ నివేదికలను తయారు చేయడంలో ఇన్వెస్టిగేషన్ అధికారులతో పాటు స్టేషన్ రైటర్స్ పాత్ర ఎంతో కీలకమని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. కేసుల దర్యాప్తు నాణ్యతను మరింత మెరుగుపర్చేందుకు ఐఓలకు రైటర్లు దోహదకారులుగా ఉంటారని ఆయన తెలిపారు. సైబరాబాద్ సీటీసీ ఆధ్వర్యంలో కొత్తగా నియామకమైన కానిస్టేబుల్ అధికారులకు స్టేషన్ రైటర్స్ నైపుణ్యాలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమం సోమవారం ముగిసింది.

ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ… కొత్తగా నియామకమైన కానిస్టేబుల్ అధికారులు పోస్టింగ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉన్నతాధికారుల నమ్మకాన్ని పొందాలన్నారు. ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్ కుమార్ మాట్లాడుతూ.. నేర్చుకోవడం నిరంతరం ప్రక్రియ అన్నారు. పిటిషనర్లకు న్యాయం చేయాలనే లక్ష్యంతో మాత్రమే పోలీసు శాఖలో పనిచేయాలన్నారు. కేసుల దర్యాప్తు విధానంలో ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ కావాలన్నారు.

Tags:    

Similar News