వ్యాక్సిన్ కోసం వీరంగం… పురుగుల మందు డబ్బాతో…
దిశ, జమ్మికుంట: కరోనా వ్యాక్సిన్ రెండో డోసు కోసం ఓ వ్యక్తి క్రిమిసంహారక మందు డబ్బాతో ఆందోళనకు దిగిన సంఘటన వీణవంక మండలం చల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వీపర్ గా పనిచేస్తున్న దావీదు అనే వ్యక్తి కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు వేసుకొని 90 రోజులు పూర్తి అవుతుంది. దీంతో దావీదు రెండో డోసు వేయించుకునేందు కోసం గత నాలుగు రోజులుగా మెడికల్ ఆఫీసర్ శ్రీధర్ ను అడుగుతూ వస్తున్నాడు. […]
దిశ, జమ్మికుంట: కరోనా వ్యాక్సిన్ రెండో డోసు కోసం ఓ వ్యక్తి క్రిమిసంహారక మందు డబ్బాతో ఆందోళనకు దిగిన సంఘటన వీణవంక మండలం చల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వీపర్ గా పనిచేస్తున్న దావీదు అనే వ్యక్తి కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు వేసుకొని 90 రోజులు పూర్తి అవుతుంది.
దీంతో దావీదు రెండో డోసు వేయించుకునేందు కోసం గత నాలుగు రోజులుగా మెడికల్ ఆఫీసర్ శ్రీధర్ ను అడుగుతూ వస్తున్నాడు. అయితే ప్రభుత్వ నిబంధనల మేరకు మరో రెండు వారాలు ఆగాలని డాక్టర్ చెప్పడంతో దావీదు పురుగుల మందు డబ్బాతో ఆసుపత్రి ముందు వీరంగం సృష్టించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకొని దావీదుకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు.