దిశ ఎఫెక్ట్...అక్రమ కట్టడం కూల్చివేత

కరీంనగర్ మండలం ఇరుకుల్ల గ్రామపంచాయతీ పరిధిలో 70 సర్వే నెంబర్ లో D89,9R కాల్వ భూమిని ఆక్రమించి అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాన్ని అధికారులు కూల్చివేశారు.

Update: 2024-11-20 10:06 GMT

దిశ, కరీంనగర్ రూరల్ : కరీంనగర్ మండలం ఇరుకుల్ల గ్రామపంచాయతీ పరిధిలో 70 సర్వే నెంబర్ లో D89,9R కాల్వ భూమిని ఆక్రమించి అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాన్ని అధికారులు కూల్చివేశారు.

    కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాశిపాక రమేష్ మంగళవారం దిశ పత్రికకు దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. దీంతో కథనం ప్రచురితమైంది. ఇందుకు అధికారులు స్పందించి బుధవారం అక్రమ నిర్మాణాన్నికూల్చి వేశారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి జగన్మోహన్ రెడ్డి, ఇరిగేషన్ డీఈఈ సంతోష్, ఏఈఈ నళినికాంత్, కార్యదర్శి సంతోష్ పాల్గొన్నారు.  


Similar News