Congress: ఈ ఎంపిక ప్రజా పాలనకు తిరుగులేని సాక్ష్యం.. సీఎం రేవంత్ రెడ్డి
ఈ ఎంపిక రాష్ట్రంలో కొత్త ఒరవడిని సృష్టించిందని, ప్రజాపాలన(Public Governance)కు తిరుగులేని సాక్షం(Irrefutable Evidence)గా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు.
దిశ, వెబ్ డెస్క్: ఈ ఎంపిక రాష్ట్రంలో కొత్త ఒరవడిని సృష్టించిందని, ప్రజాపాలన(Public Governance)కు తిరుగులేని సాక్షం(Irrefutable Evidence)గా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు. మద్నూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్(Madnoor Market Yard Chairman) పదవి కోసం చదువుకున్న నిరుపేద మహిళను ఇంటర్వ్యూ(Interview) ద్వారా ఎంపిక చేశారు. దీనిపై రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆయన.. ప్రజాస్వామ్యం(Democracy)లో సరికొత్త అధ్యాయమని, పదవుల ఎంపికలో నయా దృక్పథమని, ప్రజా పాలన(Public Governance)కు తిరుగులేని సాక్ష్యమని చెప్పారు. మద్నూర్ మార్కెట్ యార్డ్ చరిత్రలో మొట్టమొదటి సారిగా.. ఈ రోజు నిరుపేద కుటుంబానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, మన ఆడబిడ్డ సౌజన్య మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎంపిక కావడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు.
అలాగే ఇంటర్వ్యూ పద్ధతిలో.. ప్రతిభకు ప్రాధాన్యం ఇస్తూ.. మహిళల చదువుకు, ఆత్మస్థైర్యానికి ప్రోత్సాహమిచ్చే ఈ ఎంపిక, రాష్ట్రంలో కొత్త ఒరవడిని సృష్టించిందని తెలిపారు. అంతేగాక ప్రత్యేక, పారదర్శక విధానాన్ని అవలంబించి.. ఈ పదవికి సౌజన్యని ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు(MLA Thota Lakshmi Kanta Rao)కి, సహచర మంత్రివర్యులు మా వెంకన్న(Komatireddy Venkatreddy)కి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇక పైసల కోసం పదవుల పందేరం నడిపిన గత బీఆర్ఎస్ పాలకుల్లాగా(BRS Rulers) కాకుండా, పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తను గుర్తిస్తామని, గుండెల్లో పెట్టుకుంటామని రేవంత్ రెడ్డి రాసుకొచ్చారు.