పద్మావతి నిలయం కోవిడ్సెంటర్ ఆదర్శం -చెవిరెడ్డి
దిశ, ఏపీ బ్యూరో: దేశంలోనే శ్రీ పద్మావతి నిలయం చిత్తూరు జిల్లా కోవిడ్ కేర్ సెంటర్ కరోనా బాధితులకు విశిష్ట సేవలందించడంలో ఆదర్శంగా నిలుస్తోందని ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి ఏ పీ జే అబ్దుల్ కలామ్ 89 వ జయంతిని పురస్కరించుకొని గురువారం కరోనా బాధితులకు విశిష్ట సేవలందిస్తున్న వైద్య, పారిశుద్య సిబ్బందిని చెవిరెడ్డి మెమెంటోలతో సత్కరించారు. ముందుగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చిత్ర పటానికి […]
దిశ, ఏపీ బ్యూరో: దేశంలోనే శ్రీ పద్మావతి నిలయం చిత్తూరు జిల్లా కోవిడ్ కేర్ సెంటర్ కరోనా బాధితులకు విశిష్ట సేవలందించడంలో ఆదర్శంగా నిలుస్తోందని ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి ఏ పీ జే అబ్దుల్ కలామ్ 89 వ జయంతిని పురస్కరించుకొని గురువారం కరోనా బాధితులకు విశిష్ట సేవలందిస్తున్న వైద్య, పారిశుద్య సిబ్బందిని చెవిరెడ్డి మెమెంటోలతో సత్కరించారు. ముందుగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చిత్ర పటానికి పుష్ప నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ కరోనా బాధితుడికి శ్రీ పద్మావతి నిలయంలో చేరి ఆరోగ్యంగా ఇంటికి వెళ్లగలమనే ధైర్యాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనం చేస్తున్నానన్నారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని శ్రీ పద్మావతి నిలయానికి దేశ వ్యాప్తంగా పేరు లభించడం గర్వంగా ఉందన్నారు. మార్చి నుంచి నేటి వరకు సిబ్బంది ధైర్యంగా సైనికుల్లా పనిచేస్తుండడం అభినందనీయమన్నారు.
బ్రిటన్ దేశస్తుడు ఫ్లైవ్ ఫుల్లీ కరోనా తో శ్రీ పద్మావతి నిలయంలో సేవలు పొంది తన దేశానికి తిరిగి వెళుతూ ఇక్కడి ఆతిథ్యాన్ని కొనియాడారని గుర్తుచేశారు. ఇంతటి కష్ట కాలంలో ఎందరో కరోనా బాధితులకు సేవ చేసిన అందరికీ ఏ కష్టమొచ్చినా అండగా తానుంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో తుడా సెక్రటరీ లక్ష్మీ, వీసీ హరికృష్ణ మెప్మా పీడీ, సెట్విన్ సీఈఓ మురళీకృష్ణ రెడ్డి, ఐఎం ఏ సభ్యులు డాక్టర్ శ్రీహరి రావు, డాక్టర్ యుగంధర్ పాల్గొన్నారు.