చెన్నయిన్‌పై హైదరాబాద్ ఎఫ్‌సీ ఘన విజయం
దిశ, స్పోర్ట్స్ : ఐఎస్ఎల్ 2020/21 సీజన్‌లో భాగంగా సోమవారం రాత్రి జీఎంసీ స్టేడియంలో చెన్నయిన్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 4-1 తేడాతో ఘనవిజయం సాధించింది. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయి పాయింట్ల పట్టికలో వెనుకబడిన హైదరాబాద్ ఈ విజయం ఊరటనిచ్చింది. మ్యాచ్ ప్రారంభం నుంచి గోల్ కోసం ఇరుజట్లు హోరాహోరీగా పోరాడాయి. హైదరాబాద్ జట్టుకు పలు అవకాశాలు వచ్చినా గోల్ చేయడంలో విజయం సాధించలేకపోయాయి. చివరకు తొలి అర్దభాగంలో ఇరు జట్లకు ఒక్కగోల్ కూడా […]
దిశ, స్పోర్ట్స్ : ఐఎస్ఎల్ 2020/21 సీజన్‌లో భాగంగా సోమవారం రాత్రి జీఎంసీ స్టేడియంలో చెన్నయిన్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 4-1 తేడాతో ఘనవిజయం సాధించింది. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయి పాయింట్ల పట్టికలో వెనుకబడిన హైదరాబాద్ ఈ విజయం ఊరటనిచ్చింది. మ్యాచ్ ప్రారంభం నుంచి గోల్ కోసం ఇరుజట్లు హోరాహోరీగా పోరాడాయి. హైదరాబాద్ జట్టుకు పలు అవకాశాలు వచ్చినా గోల్ చేయడంలో విజయం సాధించలేకపోయాయి. చివరకు తొలి అర్దభాగంలో ఇరు జట్లకు ఒక్కగోల్ కూడా చేయలేకపోయాయి. రెండో అర్దభాగం ప్రారంభమైన కొద్ది నిమిషాలకు హైదరాబాద్ ఆటగాడు జోయల్ చైనీస్ చెన్నయిన్ డిఫెన్స్‌ను ఛేదించి గోల్ చేశాడు.
ఆ తర్వాత మరో మూడు నిమిషాలకే హైదరాబాద్ స్ట్రైకర్ హాలీచరణ్ నర్జారీ మరో గోల్ చేయడంతో హైదరాబాద్ ఆధిక్యత 2-0కు చేరింది. 67వ నిమిషంలో చెన్నయిన్ స్ట్రైకర్ అనిరుద్ థాప గోల్ చేసి ఆధిక్యాన్ని 2-1కి తగ్గించాడు. అయితే 74వ నిమిషంలో జోవా విక్టర్, 79వ నిమిషంలో హాలీచరణ్ నర్జారీ చేసిన గోల్స్‌తో హైదరాబాద్ క్లబ్ 4-1 తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. నిర్ణీత సమయం ముగిసే వరకు మరో గోల్ చేయలేదు. దీంతో హైదరాబాద్ ఎఫ్‌సీ 4-1 తేడాతో విజయం సాధించింది. ఫ్రాన్ సండాజాకు డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు, హాలీచరణ్ నర్జారీకి హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.