వాటిపై అంత నిర్లక్ష్యమెందుకు.. జర పట్టించుకోండి
దిశ, జనగామ / స్టేషన్ ఘనపూర్: హరితహారం పై జిల్లా అధికారులు చేపడుతున్న నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో గల జనగామ టూ పాలకుర్తి వెళ్లే మార్గంలోని కుందారం గ్రామ పరిధిలో సుమారుగా 100 మొక్కలకు పైగా ఎండిపోయాయి. ఎండి పోయిన మొక్కలు రోడ్డుపైన కనపడుతున్నా ఒక్కరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. గత నెల 10వ తేదీ వరకు జరిగిన పల్లె పట్టణ ప్రగతిలో భాగంగా హరితహారంలో నాటిన మొక్కలు నేడు […]
దిశ, జనగామ / స్టేషన్ ఘనపూర్: హరితహారం పై జిల్లా అధికారులు చేపడుతున్న నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో గల జనగామ టూ పాలకుర్తి వెళ్లే మార్గంలోని కుందారం గ్రామ పరిధిలో సుమారుగా 100 మొక్కలకు పైగా ఎండిపోయాయి. ఎండి పోయిన మొక్కలు రోడ్డుపైన కనపడుతున్నా ఒక్కరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. గత నెల 10వ తేదీ వరకు జరిగిన పల్లె పట్టణ ప్రగతిలో భాగంగా హరితహారంలో నాటిన మొక్కలు నేడు ఎండిపోయి రోడ్డుపైన విలవిలలాడుతున్నాయి. వీటిపై అధికారులు స్పందించకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే మొక్కలకు నీరు పోయించి వాటిని సంరక్షించాలి అని పలువురు కోరుతున్నారు.