బ్రేకింగ్ న్యూస్: పాదయాత్ర పేరు ప్రకటించిన రాజాసింగ్

దిశ, చార్మినార్​: చార్మినార్​ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ పాదయాత్ర పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​, మాజీ మంత్రి బాబుమోహన్, మాజీ శాసనసభామండలి చైర్మన్​ స్వామిగౌడ్​, మాజీ ఎమ్మెల్యే ఎన్​ విఎస్​ ప్రభాకర్, యాత్ర ప్రముఖ్​ మనోహర్​ రెడ్డిలు పాల్గొన్నారు. ముందుగా భాగ్యలక్ష్మి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, హారతి నిర్వహించారు. అనంతరం తెలంగాణలో నియంతృత్వ కుటుంబ పాలన, అవినీతి పాలన విముక్తి […]

Update: 2021-08-13 06:51 GMT

దిశ, చార్మినార్​: చార్మినార్​ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ పాదయాత్ర పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​, మాజీ మంత్రి బాబుమోహన్, మాజీ శాసనసభామండలి చైర్మన్​ స్వామిగౌడ్​, మాజీ ఎమ్మెల్యే ఎన్​ విఎస్​ ప్రభాకర్, యాత్ర ప్రముఖ్​ మనోహర్​ రెడ్డిలు పాల్గొన్నారు. ముందుగా భాగ్యలక్ష్మి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, హారతి నిర్వహించారు. అనంతరం తెలంగాణలో నియంతృత్వ కుటుంబ పాలన, అవినీతి పాలన విముక్తి కోసం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్​ ఈ నెల 24 నుంచి చార్మినార్​ భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి ప్రారంభిస్తున్న పాదయాత్రకు ప్రజా సంగ్రామయాత్రగా పేరును బీజేపీ శాసనసభ పక్ష నేత రాజాసింగ్​ ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే రాజాసింగ్​ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2023లో అధికారమే లక్ష్యంగా బండి సంజయ్​ పాదయాత్ర కొనసాగుతుందని, పాదయాత్రలో కేంద్రమంత్రులు సైతం పాల్గొంటారని తెలిపారు.

తొలివిడత పాదయాత్ర భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి హుజురాబాద్​ వరకు కొనసాగుతుందన్నారు. పాదయాత్ర విజయవంతం కోసం 29 కమిటీలు నిరంతరం పనిచేస్తాయని చెప్పారు. టీఆర్ఎస్​ ఎన్నికల హామీలు అమలు చేసే వరకు సంజయ్​ నాయకత్వంలో పోరాటం చేస్తామన్నారు. కేసీఆర్​ కుటుంబం తెలంగాణ ప్రజల రక్తం తాగుతుందని మండిపడ్డారు. తెలంగాణను అడ్డుకున్న ఓవైసీ చేతిలో కేసీఆర్​ కారు స్టీరింగ్​ పెట్టారన్నారు. సంతలో పశువులు, కుక్కలను కొన్నట్లు ఎమ్మెల్యేలను కేసీఆర్​ కొనుక్కున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి నిధులు రావడం లేదని కేసీఆర్​ అసెంబ్లీ సాక్షిగా నిస్సిగ్గుగా అబద్దాలు చెబుతున్నారని వాపోయారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, ఏపీ అక్రమంగా నీళ్లను తీసుకెళ్తుంటే ఆపే దమ్ము కేసీఆర్​కు లేకుండా పోయందన్నారు. గోషామహల్​ అభివృద్దికి రూ. 2వేల కోట్లు నిధులు మంజూరు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి తాను సిద్దమని రాజాసింగ్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చ అధ్యక్షుడు ఆలే భాస్కర్​ రాజ్​, గోల్కొండ జిల్లా అధ్యక్షుడు పాండుయాదవ్​, ఉమామహేంద్ర, గాజుల హనుమంత్​ రావు, అందెల శ్రీరాములు యాదవ్​, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News