హుజురాబాద్‌కు శుక్రవారమే ముహూర్తం

దిశ ప్రతినిది, కరీంనగర్: హుజురాబాద్ బై పోల్స్ నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది. ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1 నుండి ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. దీంతో నేటి నుండి నామినేషన్ల పర్వం కూడా మొదలు కానుంది. స్వేచ్ఛ నుండి కట్టడికి.. ఈటల ఎపిసోడ్ వ్యవహారం తరువాత ఎన్నికల రణరంగాన్ని తరలిపించిందనే చెప్పాలి. ఎన్నికల నోటిఫికేషన్ రాకపోవడంతో ప్రలోభాలు, ప్రభావాలకు స్వేచ్ఛాయుత వాతావరణం ఉండేది. కానీ శుక్రవారం నుండి మాత్రం […]

Update: 2021-09-30 09:28 GMT

దిశ ప్రతినిది, కరీంనగర్: హుజురాబాద్ బై పోల్స్ నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది. ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1 నుండి ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. దీంతో నేటి నుండి నామినేషన్ల పర్వం కూడా మొదలు కానుంది.

స్వేచ్ఛ నుండి కట్టడికి..

ఈటల ఎపిసోడ్ వ్యవహారం తరువాత ఎన్నికల రణరంగాన్ని తరలిపించిందనే చెప్పాలి. ఎన్నికల నోటిఫికేషన్ రాకపోవడంతో ప్రలోభాలు, ప్రభావాలకు స్వేచ్ఛాయుత వాతావరణం ఉండేది. కానీ శుక్రవారం నుండి మాత్రం ఇలాంటి ప్రచారాలకు తెరపడనుంది. ఎన్నికల కమిషన్ నిఘా నీడనే ఆయా పార్టీలు ప్రచారాలు కొనసాగించాల్సి ఉంటుంది. ఐదు నెలలుగా తమ ప్రభావాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించిన రాజకీయ పక్షలు ఇక నుండి కట్టడిగానే ముందుకు సాగాల్సి ఉంటుంది.

అభ్యర్థుల ప్రకటనే మిగిలింది..

హుజురాబాద్ బరిలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది. అధికారికంగా ప్రకటించనప్పటికీ బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం నేటికీ మల్లగుల్లాలు పడుతూనే ఉంది. అభ్యర్థి ఎంపిక విషయంలో కమిటీలు, సీల్డ్ కవర్లు అంటూ కాలం వెల్లదీస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ క్యాండెట్‌ను డిక్లేర్ చేసేందుకు ఇంకా కసరత్తు చేయడంలోనే మునిగిపోయింది.

పోటీ చేసేదెవరో…

హుజురాబాద్ ఉప ఎన్నికల హాడావుడి మొదలైనప్పటి నుండి తాము పోటీ చేస్తామంటే తాము పోటీ చేస్తామంటూ ప్రకటన వర్షం కురిసిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో నోటిపికేషన్ తరువాత ఎవరెవరు నామినేషన్లు దాఖలు చేస్తారో వేచి చూడాల్సి ఉంది. ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఎంపీటీసీల సంఘం, నిరుద్యోగులు, నేత కుటుంబాలకు చెందిన వితంతువులు, మిడ్ మానేరు ముంపు బాధితులతో పాటు వివిధ రంగాలకు చెందిన వారు పోటీ చేస్తామంటూ ముందుకు వచ్చారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తామంతా పోటీ చేసి టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తాని ప్రకటించారు. అయితే నోటిఫికేషన్ అమల్లోకి వచ్చిన తరువాత ఎవరెవరు నామినేషన్లు దాఖలు చేస్తారోనన్న విషయంపై చర్చ సాగుతోంది.

Tags:    

Similar News