ఫోన్ వాడొద్దన్న తల్లి.. మనస్థాపానికి గురై ఏం చేసిందంటే..?

దిశ, మేడిపల్లి : ఫోన్ వాడొద్దని తల్లి మందలించడంతో మనస్థాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నోజిగూడ ఆర్జీకే కాలనీలో నివాసం ఉండే జమ్మికుంట విష్ణు హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా విష్ణు కుమార్తె జమ్మికుంట స్రవంతి (16) ను తన తల్లి ఫోన్ వాడొద్దని మందలించగా మనోవేదనకు […]

Update: 2021-06-19 08:29 GMT

దిశ, మేడిపల్లి : ఫోన్ వాడొద్దని తల్లి మందలించడంతో మనస్థాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నోజిగూడ ఆర్జీకే కాలనీలో నివాసం ఉండే జమ్మికుంట విష్ణు హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు.

ఇదిలా ఉండగా విష్ణు కుమార్తె జమ్మికుంట స్రవంతి (16) ను తన తల్లి ఫోన్ వాడొద్దని మందలించగా మనోవేదనకు గురైన తన కుమార్తె 18వ తేదీ అర్ధరాత్రి సమయంలో బయటికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. తన కూతురు మరణంపై ఎటువంటి అనుమానం లేదని ఘట్‌కేసర్ పోలీసులకు స్రవంతి తల్లదండ్రులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జ్ఞానేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోందని సీఐ చంద్రబాబు తెలిపారు.

Tags:    

Similar News