మరో వ్యక్తితో సహజీవనం.. కొడుకును 15వేలకు అమ్మిన తల్లి
దిశ, నర్సాపూర్ : నవమాసాలు మోసి ఎంతో ఆప్యాయంగా, అల్లారుముద్దుగా పెంచుకున్న ఓ తల్లి తన కన్న కొడుకును రూ.15 వేలకు అమ్ముకున్న సంఘటన ఆలస్యంగా నర్సాపూర్ మండలంలో వెలుగు చూసింది. గ్రామస్తులు, ఐసీడీఎస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామానికి చెందిన ఎర్రొల్ల పోచమ్మకు శ్రీశైలం(12) మహేష్ (7) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కొంతకాలం క్రితం పోచమ్మ భర్తను వదిలేయడంతో ఆమె ఒంటరిగా ఉంటుంది. అయితే పెద్దకుమారుడు […]
దిశ, నర్సాపూర్ : నవమాసాలు మోసి ఎంతో ఆప్యాయంగా, అల్లారుముద్దుగా పెంచుకున్న ఓ తల్లి తన కన్న కొడుకును రూ.15 వేలకు అమ్ముకున్న సంఘటన ఆలస్యంగా నర్సాపూర్ మండలంలో వెలుగు చూసింది. గ్రామస్తులు, ఐసీడీఎస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామానికి చెందిన ఎర్రొల్ల పోచమ్మకు శ్రీశైలం(12) మహేష్ (7) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
కొంతకాలం క్రితం పోచమ్మ భర్తను వదిలేయడంతో ఆమె ఒంటరిగా ఉంటుంది. అయితే పెద్దకుమారుడు శ్రీశైలంను తన తల్లి వద్ద చింతకుంటలో విడిచి పెట్టి చిన్నకుమారుడు మహేష్‌ను తీసుకొని 6 నెలలుగా గుమ్మడిదలలో మరో వ్యక్తితో కలిసి సహ జీవనం చేస్తున్నది. రెండు నెలల కిందట ఓ మధ్యవర్తి ద్వారా తన చిన్నకుమారుడిని అమ్మకానికి పెట్టింది. బేరం కూదరడంతో రూ.15వేలకు విక్రయించింది. ఇందులో రూ.10వేలు పోచమ్మ తీసుకోగా రూ.5వేలు మధ్యవర్తికి ఇచ్చినట్లు తెలిసింది.
అయితే పోచమ్మ శనివారం చిన్నచింతకుంట గ్రామానికి ఒంటరిగా రావడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు చిన్నకుమారుడి కోసం ఆరా తీసి ప్రశ్నించడంతో మహేష్‌ను అమ్మినట్లు అసలు విషయం చెప్పింది. ఈ విషయం కాస్తా ఐసీడీఎస్, పోలీసు అధికారులకు తెలియడంతో వారు గ్రామానికి చేరుకొని విచారించగా కుమారుడిని రూ.15వేలకు అమ్మినట్టు ఒప్పుకుంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహేష్‌ను ఎవరికి అమ్మారు. మధ్యవర్తి ఎవరూ అనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. పోచమ్మ వ్యవహారంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.