వరాహానికి అమ్మ అయిన శునకం!

దిశ, వెబ్‌డెస్క్ : కులం, వర్గం అంటూ మనిషికి మనిషే శత్రువుగా మారి కత్తులు దూసుకుంటున్న ఈ రోజుల్లో జాతి వైరం మరిచి ఓ జీవి కడుపు నింపింది మరో మూగజీవి. ఆకలిగొన్న వరాహం (పంది) పిల్లకు ఓ శునకం పాలిచ్చి ఆకలి తీర్చుతోంది. ఇలా ఏ ఒక్కరోజో కాదు.. పది రోజులుగా ఆ శునకం.. వరాహాలు ఉండే ప్రాంతానికి వెళ్లి వాటి కడుపు నింపుతుండడం గమనార్హం. వికారాబాద్ జిల్లా యాలాల్ మండల కేంద్రంలో జరుగుతున్న ఈ […]

Update: 2021-01-24 11:01 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కులం, వర్గం అంటూ మనిషికి మనిషే శత్రువుగా మారి కత్తులు దూసుకుంటున్న ఈ రోజుల్లో జాతి వైరం మరిచి ఓ జీవి కడుపు నింపింది మరో మూగజీవి. ఆకలిగొన్న వరాహం (పంది) పిల్లకు ఓ శునకం పాలిచ్చి ఆకలి తీర్చుతోంది. ఇలా ఏ ఒక్కరోజో కాదు.. పది రోజులుగా ఆ శునకం.. వరాహాలు ఉండే ప్రాంతానికి వెళ్లి వాటి కడుపు నింపుతుండడం గమనార్హం. వికారాబాద్ జిల్లా యాలాల్ మండల కేంద్రంలో జరుగుతున్న ఈ ఘటనను చూసిన ప్రజలు శునకం ఔదర్యాన్ని కొనియాడుతున్నారు. జాతులు కాదు.. మానవత్వమే ముఖ్యమని చాటిచెబుతోందీ ఘటన అని పేర్కొంటున్నారు.

Tags:    

Similar News