మృతుల కుటుంబాలకు అండ‌గా ప్రభుత్వం : మంత్రి అజ‌య్‌

దిశ, ఖ‌మ్మం: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద బుధ‌వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులైన వారిని ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతున్న క్ష‌త‌గాత్రుల‌ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరామర్శించారు. ప్ర‌మాదం జ‌రిగిన తీరుపై వారిని అడిగి తెలుసుకున్నారు. ఎర్రుపాలెం మండలం పెద్ద గోపవరం గ్రామానికి చెందిన మృతుల కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అదుకుంటుందని తెలిపారు. ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. ప్రమాదంలో […]

Update: 2020-06-17 09:14 GMT

దిశ, ఖ‌మ్మం: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద బుధ‌వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులైన వారిని ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతున్న క్ష‌త‌గాత్రుల‌ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరామర్శించారు. ప్ర‌మాదం జ‌రిగిన తీరుపై వారిని అడిగి తెలుసుకున్నారు. ఎర్రుపాలెం మండలం పెద్ద గోపవరం గ్రామానికి చెందిన మృతుల కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అదుకుంటుందని తెలిపారు. ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయాలపాలైన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్న‌ట్టు తెలిపారు. న్యూరో సంబంధిత చికిత్స కోసం మమత ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్సను అందిస్తామని చెప్పారు. ఈ మేర‌కు అధికారులతో మాట్లాడినట్టు వివరించారు. మృతుల కుటుంబానికి త‌న ప్ర‌గాఢ సంతాపాన్ని తెలుపుతున్న‌ట్టు పేర్కొన్నారు. మంత్రి వెంట మేయర్ పాపాలాల్, కలెక్టర్ ఆర్‌వీ.కర్ణన్, డీఎంఅండ్‌హెచ్‌వో మాలతి, ఆసుపత్రి సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వర్లు, త‌దితరులు ఉన్నారు.

ఘ‌ట‌న‌పై సీఎల్పీ నేత భ‌ట్టి విచారం..

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది మృత్యువాత ప‌డ‌టంపై సీఎల్‌పీ నాయకుడు భట్టి విక్రమార్క తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. హైద‌రాబాద్‌లో ఉన్న ఆయ‌న బాధిత కుటుంబాల స‌భ్యుల‌తో ఫోన్‌లో మాట్లాడారు. బాధిత కుటుంబానికి అందుబాటులో ఉండాలని మండల కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌ను ఆదేశించారు.

Tags:    

Similar News