పెన్సిల్‌పై దేశ చిత్రపటం: వావ్ నళిని.. నీ దేశభక్తికి జోహార్లు

దిశ,ఏపీ బ్యూరో: అమరుల త్యాగ ఫలితంగా సాధించుకున్న 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని సూచిస్తూ ఓ సూక్ష్మ కళాకారిణి దేశ చిత్రపటాన్ని పెన్సిల్‌పై వేసి తన దేశభక్తిని చాటారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మంత్రాలయంలోని మనసాని రాఘవేంద్రశెట్టి, వీణాల కుమార్తె నళిని తన ప్రతిభతో సూక్ష్మ రూపంలో దేశ చిత్రపటాన్ని వజ్రోత్సవాలకు గుర్తుగా 75 సంఖ్యను సూచించే విధంగా పెన్సిల్‌పై చెక్కారు. మూడు గంటల సమయంలో 1.3 సెంటీమీటర్ల పొడవుతో 5 మిల్లీమీటర్ల వెడల్పుతో నిర్మించినట్లు నళిని […]

Update: 2021-08-15 04:57 GMT

దిశ,ఏపీ బ్యూరో: అమరుల త్యాగ ఫలితంగా సాధించుకున్న 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని సూచిస్తూ ఓ సూక్ష్మ కళాకారిణి దేశ చిత్రపటాన్ని పెన్సిల్‌పై వేసి తన దేశభక్తిని చాటారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మంత్రాలయంలోని మనసాని రాఘవేంద్రశెట్టి, వీణాల కుమార్తె నళిని తన ప్రతిభతో సూక్ష్మ రూపంలో దేశ చిత్రపటాన్ని వజ్రోత్సవాలకు గుర్తుగా 75 సంఖ్యను సూచించే విధంగా పెన్సిల్‌పై చెక్కారు. మూడు గంటల సమయంలో 1.3 సెంటీమీటర్ల పొడవుతో 5 మిల్లీమీటర్ల వెడల్పుతో నిర్మించినట్లు నళిని తెలిపారు. గతంలో కూడా తన ప్రతిభతో సూక్ష్మ రూపంలో కళాకృతులను నళిని నిర్మించారు. నళిని ప్రతిభను పలువురు ప్రశంసిస్తున్నారు.

Tags:    

Similar News