టూత్ బ్రష్‌ను మింగిన ఘనుడు.. సీన్ కట్ చేస్తే..

దిశ, వెబ్‌డెస్క్ : చిన్న పిల్లలు నోట్లో వేసుకున్న వస్తువులను మింగడం చూస్తూనే ఉంటాం. బలపాలు, రూపాయ బిల్లలు ఇలా చిన్నచిన్న ఐటెమ్స్ ను మింగుతూ ఉంటారు. ఇది సహజంగా అనిపించినా ఓ వ్యక్తి మాత్రం ఏకంగా టూత్ బ్రష్ ను మింగి ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మహారాష్ట్రలోని ఔరంగబాద్ లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఔరంగబాద్‌కు చెందిన ఓ వ్యక్తి పళ్లు తోముకుంటూ పొరపాటున బ్రష్‌ను మింగేశాడు. అప్పుడు టేకిటీజీ […]

Update: 2020-12-30 11:53 GMT

దిశ, వెబ్‌డెస్క్ : చిన్న పిల్లలు నోట్లో వేసుకున్న వస్తువులను మింగడం చూస్తూనే ఉంటాం. బలపాలు, రూపాయ బిల్లలు ఇలా చిన్నచిన్న ఐటెమ్స్ ను మింగుతూ ఉంటారు. ఇది సహజంగా అనిపించినా ఓ వ్యక్తి మాత్రం ఏకంగా టూత్ బ్రష్ ను మింగి ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మహారాష్ట్రలోని ఔరంగబాద్ లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఔరంగబాద్‌కు చెందిన ఓ వ్యక్తి పళ్లు తోముకుంటూ పొరపాటున బ్రష్‌ను మింగేశాడు. అప్పుడు టేకిటీజీ తీసుకున్న అతడికి ఆ తర్వాత తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ ఆస్పత్రి డీన్ డాక్టర్ కన్నన్ యెకికార్ ఆధ్వర్యంలో పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేసి టూత్ బ్రష్‌ను బయటకు తీశారు. దీంతో అతడికి ప్రాణాపాయం తప్పింది.

 

Tags:    

Similar News