ప్రాణం తీసిన నాచు
దిశ, మహబూబ్ నగర్: జిల్లాలో గతకొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గ్రామాల్లో భూగర్భజలాల పెంపొందించేందుకు నిర్మించిన చెక్ డ్యాముల్లో గ్రామాల ప్రజలు చేపలు పట్టుకుంటున్నారు. శుక్రవారం ఉదయం చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. అధికారుల కథనం ప్రకారం వివరాలు.. మహబూబ్ నగర్ రూరల్ మండలం కోటకదిర గ్రామానికి చెందిన గూడెం శేఖర్ చేపల వేట కోసం నీటి లోపలికి వెళ్లాడని, అక్కడ నాచు చుట్టుకుని చనిపోయాడని తెలిపారు. కేసు […]
దిశ, మహబూబ్ నగర్: జిల్లాలో గతకొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గ్రామాల్లో భూగర్భజలాల పెంపొందించేందుకు నిర్మించిన చెక్ డ్యాముల్లో గ్రామాల ప్రజలు చేపలు పట్టుకుంటున్నారు. శుక్రవారం ఉదయం చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. అధికారుల కథనం ప్రకారం వివరాలు.. మహబూబ్ నగర్ రూరల్ మండలం కోటకదిర గ్రామానికి చెందిన గూడెం శేఖర్ చేపల వేట కోసం నీటి లోపలికి వెళ్లాడని, అక్కడ నాచు చుట్టుకుని చనిపోయాడని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ అధికారులు వివరించారు.