రంగంలోకి స్టార్ క్యాంపెయినర్లు.. హుజురాబాద్‌లో తప్పని త్రిముఖ పోటీ

దిశ, హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ ఉప ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ పార్టీ ఆలస్యంగా అభ్యర్ధిని ప్రకటించడంతో ఆ పార్టీలోని కొందరు ముఖ్య నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్, బీజేపీ కండువాలు కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బల్మూరి వెంకట నర్సింగరావు (వెంకట్)ను అధిష్టానం ప్రకటించడంతో త్రిముఖ పోరు అనివార్యమైంది. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన బల్మూరి ఇతర పార్టీలలో చేరిన ముఖ్య నాయకులు, కార్యకర్తలను తిరిగిపార్టీలోకి రప్పించేందుకు వారిని […]

Update: 2021-10-16 06:26 GMT

దిశ, హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ ఉప ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ పార్టీ ఆలస్యంగా అభ్యర్ధిని ప్రకటించడంతో ఆ పార్టీలోని కొందరు ముఖ్య నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్, బీజేపీ కండువాలు కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బల్మూరి వెంకట నర్సింగరావు (వెంకట్)ను అధిష్టానం ప్రకటించడంతో త్రిముఖ పోరు అనివార్యమైంది. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన బల్మూరి ఇతర పార్టీలలో చేరిన ముఖ్య నాయకులు, కార్యకర్తలను తిరిగిపార్టీలోకి రప్పించేందుకు వారిని కలిసి మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. 2018లో దాదాపు 62వేల ఓట్లు సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ గూటికి చేరడంతో కార్యకర్తలు చెల్లా చెదురయ్యారు. పాత క్యాడర్ తిరిగి కాంగ్రెస్‌లో చేరితే ఉప ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఏర్పడనుంది.

Tags:    

Similar News