దిశ ఎఫెక్ట్.. వృద్దురాలి బంధువుల పై కేసు నమోదు చేసిన పోలీసులు..

జగిత్యాల పట్టణానికి చెందిన సాధుల సత్తమ్మ(85) మంగళవారం సాయంత్రం మరణించగా సుమారు 6 గంటలకు పైగా మృతదేహాన్ని ఇంట్లోకి రానివ్వకుండా అంబులెన్స్ లోనే ఉంచారు.

Update: 2024-12-26 03:00 GMT

దిశ, జగిత్యాల కలెక్టరేట్ : జగిత్యాల పట్టణానికి చెందిన సాధుల సత్తమ్మ(85) మంగళవారం సాయంత్రం మరణించగా సుమారు 6 గంటలకు పైగా మృతదేహాన్ని ఇంట్లోకి రానివ్వకుండా అంబులెన్స్ లోనే ఉంచారు. ఈ ఘటన పై దిశ "6 గంటలైన అంబులెన్స్ లోనే మృతదేహం " కథనాన్ని ప్రచురించింది. ఈ ఘటన పై స్పందించిన జగిత్యాల పోలీసులు వృద్ధురాలి మృతదేహానికి జరిగిన అవమానం పై సుమోటోగా కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా మృతురాలి భర్త 20 ఏళ్ళ క్రితమే మరణించగా వారసులు లేకపోవడంతో తోటి కోడలు కొడుకులను చేరదీసి ఆస్తిని పంచింది. అయితే వృద్ధాప్యంలో సత్తమ్మ పోషణ బాధ్యతను చూడకుండా వ్యవహరించిన సాధుల ప్రసాద్, సాధుల రవి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మన్మధరావు తెలిపారు.


Similar News