జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఇద్దరు ఎంపిక

జాతీయస్థాయి మెన్స్ సీనియర్ హ్యాండ్ బాల్​ పోటీలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన జైనపురం వంశీ, మెట్పల్లిలోని వర్షకొండ పాఠశాలలో పీడీగా పనిచేస్తున్న జెట్టిపల్లి అశోక్ ఎంపికయ్యారు.

Update: 2024-12-26 13:09 GMT

దిశ, వెల్గటూర్ : జాతీయస్థాయి మెన్స్ సీనియర్ హ్యాండ్ బాల్​ పోటీలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన జైనపురం వంశీ, మెట్పల్లిలోని వర్షకొండ పాఠశాలలో పీడీగా పనిచేస్తున్న జెట్టిపల్లి అశోక్ ఎంపికయ్యారు. హ్యాండ్బాల్ అసోసియేషన్ తెలంగాణ (హాట్) ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఎల్ బీ స్టేడియంలో గత ఆదివారం జరిగిన సెలెక్షన్ అండ్ ట్రయల్స్ లో సీనియర్ పురుషుల విభాగంలో అత్యంత ప్రతిభ కనబరిచి వీరు జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ టీంకు ఎంపికయ్యారు.

     ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి వీరు ఎంపిక కావడం విశేషమని హ్యాండ్ బాల్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వడ్లూరి రాజేందర్, జిట్టబోయిన శ్రీను తెలిపారు. వీరు ఈ నెల 26 నుండి 29 వ తేదీ వరకు కేరళ రాష్ట్రంలో జరిగే 53వ జాతీయస్థాయి సినియర్ పురుషుల హ్యాండ్ బాల్ పోటీలలో పాల్గొంటారు. వీరి ఎంపిక పట్ల మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావు, మాజీ సైనికులు ఫౌండర్ రమణారెడ్డి, ఓజ్జల మహేష్, డీవైఎస్ ఓ రవికుమార్, ఎస్జీఎఫ్ సెక్రటరీ లక్ష్మీరాం నాయక్, అసోసియేషన్ సభ్యులు పిడుగు భాస్కర్, జైనపురం సాయికుమార్, సీనియర్ క్రీడాకారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, అభినందనలు తెలిపారు. 


Similar News