BRS: సిరిసిల్ల బీఆర్ఎస్ నేత తోట ఆగయ్య అరెస్ట్

సిరిసిల్ల(Siricilla) బీఆర్ఎస్ నేత తోట ఆగయ్య(BRS Leader Thota Agaiah) పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2025-01-14 02:42 GMT
BRS: సిరిసిల్ల బీఆర్ఎస్ నేత తోట ఆగయ్య అరెస్ట్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: సిరిసిల్ల(Siricilla) బీఆర్ఎస్ నేత తోట ఆగయ్య(BRS Leader Thota Agaiah) పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం(Narimnagar Collector Office)లో జరిగిన ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(BRS MLA Padi Koushik Reddy)ని కరీంనగర్ పోలీసులు(Karimnagar Police) అరెస్ట్(Arrest) చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అరెస్ట్ చేసి, కరీంనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో పాడి కౌశిక్ రెడ్డిని కలిసేందుకు సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య బయలుదేరారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కొదురుపాక వద్ద ఆగయ్యను అడ్డుకున్నారు. తాను కలిసి వచ్చేందుకు మాత్రమే వెళ్తున్నాని, వెల్లనివ్వాలని పోలీసులకు ఆగయ్య చెప్పారు. దీనికి పోలీసులు జిల్లాలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నదని, వెళ్లవద్దని సూచించారు. అనంతరం పోలీసులు ఆగయ్యను అదుపులోకి తీసుకొని, పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Tags:    

Similar News