అది తెలంగాణ బీసీల చిరకాల కోరిక.. మండలి డిప్యూటీ చైర్మన్‌కు MLC కవిత కీలక రిక్వెస్ట్

యూనైటెట్ పూలే ఫ్రంట్(United Phule Front), తెలంగాణ జాగృతి(Telangana Jagruti) నాయకులు

Update: 2025-03-28 10:15 GMT
అది తెలంగాణ బీసీల చిరకాల కోరిక.. మండలి డిప్యూటీ చైర్మన్‌కు MLC కవిత కీలక రిక్వెస్ట్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: యూనైటెట్ పూలే ఫ్రంట్(United Phule Front), తెలంగాణ జాగృతి(Telangana Jagruti) నాయకులు, బీసీ సంఘాల నాయకులతో కలిసి మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్‌(Banda Prakash Mudiraj)ను బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) కలిశారు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతీరావు పూలే(Jyotirao Phule) విగ్రహాన్ని ఏర్పాటుకు సహకరించాలని వినతి పత్రం అందించారు. విగ్రహ ఏర్పాటు ప్రజాస్వామ్య స్పూర్తిని మరింత ఇనుమడింపజేస్తుందని చెప్పారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం బీసీల చిరకాల కోరిక అని వెల్లడించారు. తెలంగాణ జాగృతి పోరాటాలతో గతంలో అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఉదాత్తమైన భావాలు చట్టసభల్లో నిరంతరం ప్రతిఫలించడానికి మహోన్నత వ్యక్తుల విగ్రహాలను ఏర్పాటు చేయాల్సిన అవసనరం ఉంది.

Tags:    

Similar News