జంతువుల కళేబరాలు, వ్యర్ధాలకు అడ్డాగా ఇరుకుల్ల రాజీవ్ రహదారి..
కరీంనగర్ మండలం ఇరుకుల్ల గ్రామ శివారు నుంచి రామగుండం వెళ్లే రాజీవ్ రహదారి పక్కన కిలోమీటర్ పొడవున నగరం నుండి గుర్తుతెలియని వ్యక్తులు వ్యర్ధాలను, మృతి చెందిన జంతువులను, వాటి కళేబరాలు, చికెన్ వ్యర్ధాలను, తీసుకొచ్చి హైవే రోడ్డు పక్కన డంప్ చేస్తున్నారు.
దిశ, కరీంనగర్ రూరల్ : కరీంనగర్ మండలం ఇరుకుల్ల గ్రామ శివారు నుంచి రామగుండం వెళ్లే రాజీవ్ రహదారి పక్కన కిలోమీటర్ పొడవున నగరం నుండి గుర్తుతెలియని వ్యక్తులు వ్యర్ధాలను, మృతి చెందిన జంతువులను, వాటి కళేబరాలు, చికెన్ వ్యర్ధాలను, తీసుకొచ్చి హైవే రోడ్డు పక్కన డంప్ చేస్తున్నారు. తద్వారా వాహనదారులకు, రైతులకు, ఉపాధి హామీ కూలీలకు, దుర్వాసన వచ్చి ఇబ్బందికరంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. అధికారులు స్పందించి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరిమానా విధించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు.