వేములవాడ - కరీంనగర్ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం..

వేములవాడ - కరీంనగర్ ప్రధాన రహదారిలోని బోయినిపల్లి మండలం వెంకట్రావు పేట వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Update: 2024-12-26 04:43 GMT

దిశ, వేములవాడ టౌన్ : వేములవాడ - కరీంనగర్ ప్రధాన రహదారిలోని బోయినిపల్లి మండలం వెంకట్రావు పేట వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనక నుండి కారు అతివేగంగా వెళ్లి ఢీ కొనడంతో కారులోని ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి గురైన వారు కరీంనగర్ సమీపంలోని తిమ్మాపూర్ కు చెందిన వారిగా గుర్తించారు. తిమ్మాపూర్ కు చెందిన అయ్యప్ప స్వాములు కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ రాజన్నను దర్శించుకుని తిరిగి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News