మానసిక సమస్యతో బాధపడుతున్న వ్యక్తి ఆత్మహత్య
మానసిక సమస్యతో బాధపడుతున్న యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం గొల్లపల్లి మండలంలో చోటు చేసుకుంది.
దిశ, గొల్లపల్లి : మానసిక సమస్యతో బాధపడుతున్న యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం గొల్లపల్లి మండలంలో చోటు చేసుకుంది. పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బీబీరాజ్ పల్లి గ్రామానికి చెందిన దొనకొండ గంగాధర్ ( 23) గత కొన్ని సంవత్సరాలుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. అందుకోసం చికిత్స తీసుకున్నా వ్యాధి నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి దొనకొండ లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు గొల్లపల్లి పోలీస్ లు తెలిపారు.