షారుఖ్ కొడుకు కేసు ఉత్తిదే.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌ను ఇటీవల డ్రగ్స్ కేసులో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. క్రూయీజ్ షిప్లో జరిగిన పార్టీలో ఆర్యన్ దగ్గర డ్రగ్స్ దొరికాయని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, తాజాగా.. ఆర్యన్ ఖాన్ అరెస్ట్‌పై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సంచలన ఆరోపణలు చేశాడు. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అంత ఉత్తిదే అని, అది నకిలీ అరెస్ట్ అని మంత్రి అన్నారు. మహారాష్ట్రలోని […]
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌ను ఇటీవల డ్రగ్స్ కేసులో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. క్రూయీజ్ షిప్లో జరిగిన పార్టీలో ఆర్యన్ దగ్గర డ్రగ్స్ దొరికాయని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, తాజాగా.. ఆర్యన్ ఖాన్ అరెస్ట్‌పై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సంచలన ఆరోపణలు చేశాడు. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అంత ఉత్తిదే అని, అది నకిలీ అరెస్ట్ అని మంత్రి అన్నారు. మహారాష్ట్రలోని క్రైమ్ రిపోర్టర్లకు నెలరోజుల ముందు నుండే నెక్ట్స్ టార్గెట్ షారుఖ్ ఖాన్ అని ప్రచారం చేయబడిందన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును సీబీఐ ఇప్పటికీ కొలిక్కి తీసుకురాకపోవడంతో బాలీవుడ్ సెలెబ్రెటీలపై నమోదయ్యే డ్రగ్స్ కేసులు కొన్నిరోజుల తర్వాత కనుమరుగు అయిపోతాయని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇలాంటి కేసులపై రాజకీయ పెద్దల ఒత్తిడి ఉండడం వల్ల ఏ కేసులూ కొనసాగవని ప్రచారం సాగుతోంది.
Aryan Khan's arrest is a forgery. For the last one month, the information was being circulated to crime reporters that the next target is actor Shah Rukh Khan: Maharashtra Minister Nawab Malik pic.twitter.com/moaRhfzZx2
— ANI (@ANI) October 6, 2021