ప్రపంచ కుబేరుడిని కోర్టులో నిలబెట్టిన రణ్‌దీప్

దిశ, ఫీచర్స్: రణ్‌దీప్ హోతి.. ప్రస్తుతం ఈ పేరు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా? ప్రపంచ కుబేరుడు, ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా యజమాని ఎలన్ మస్క్‌ను కోర్టుకు లాగిన వ్యక్తి.. తనకు పరువు నష్టం కలిగించాడని ఆరోపిస్తూ అమెరికాలోని ఓ న్యాయస్థానంలో రణదీప్ హోతి అనే భారత సంతతి విద్యార్థి దావా వేశాడు. ఈ కేసు తాజాగా విచారణకు రాగా రణ్‌దీప్ దాఖలు చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, […]

Update: 2021-01-31 03:51 GMT

దిశ, ఫీచర్స్: రణ్‌దీప్ హోతి.. ప్రస్తుతం ఈ పేరు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా? ప్రపంచ కుబేరుడు, ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా యజమాని ఎలన్ మస్క్‌ను కోర్టుకు లాగిన వ్యక్తి.. తనకు పరువు నష్టం కలిగించాడని ఆరోపిస్తూ అమెరికాలోని ఓ న్యాయస్థానంలో రణదీప్ హోతి అనే భారత సంతతి విద్యార్థి దావా వేశాడు. ఈ కేసు తాజాగా విచారణకు రాగా రణ్‌దీప్ దాఖలు చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, తన భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉందనే మస్క్​ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. దీంతో రణ్‌దీప్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు.

రణదీప్ హోతి ప్రస్తుతం మిచిగాన్ విశ్వవిద్యాలయంలో ‘ఆసియన్ లాంగ్వేజెస్ అండ్ కల్చర్స్’ మీద డాక్టరల్ డిగ్రీ చేస్తున్నారు. ఇతను ట్విట్టర్ వేదికగా మస్క్ కంపెనీ ‘టెస్లా’ మీద తరుచుగా విమర్శలు చేస్తుంటారు. రణ్‌దీప్ తనను తాను కార్పొరేట్ ఫ్రాడ్ మీద ‘ఇన్వెస్టిగేటింగ్/రిపోర్టింగ్’ చేసే వ్యక్తిగా పేర్కొంటాడు. హోతి నివాసముండే ఫ్రీమాంట్‌లోనే టెస్లా ఆటో ప్లాంట్ ఉండటంతో, టెస్లా కంపెనీ మీద రణ్‌దీప్ దృష్టి పెట్టాడు. టెస్లా మాజీ ఉద్యోగులతో పాటు, తనలాగే కార్పొరేట్ ఫ్రాడ్ మీద పనిచేసే విద్యార్థులతో కూడిన ‘ట్విట్టర్ గ్లోబల్ గ్రూపు’లో అతను సభ్యుడు. ఈ గ్రూపు సభ్యులంతా ‘డాలర్ టీఎస్ఎల్ఏక్యూ’ ($TSLAQ) అనే హ్యాష్‌ట్యాగ్‌తో తమను తాము ట్యాగ్ చేసుకుంటూ, వివిధ పేర్లతో (ఒరిజినల్ నేమ్స్ కాకుండా) టెస్లా కంపెనీతో పాటు, దాని యజమాని మస్క్‌పై విమర్శనాత్మక ట్వీట్లు చేస్తుంటారు. ఈ క్రమంలో ‘స్కాబూష్కా’ (@skabooshka) పేరుతో రణ్‌దీప్ ట్వీట్లు చేస్తుంటాడు. ‘కార్పొరేట్ ఫ్రాడ్’ మీద రిపోర్టింగ్ చేసే రణ్‌దీప్ ఓ సారి (2019 ఫిబ్రవరిలో) ఎలక్ట్రిక్ కార్లపై అధ్యయనం చేసేందుకు ఫ్రీమోంట్​లోని టెస్లా ఆటో ప్లాంట్‌‌కు వెళ్లగా, తనను లోపలికి రానీయకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో చిన్నపాటి గొడవ జరిగింది. ఆ తర్వాత ఏప్రిల్​లో టెస్లా కారు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు రణ్‌దీప్.

ఈ రెండు ఘటనల కారణంగా..రణ్‌దీప్ తమ ఉద్యోగులపై దాడికి పాల్పడటంతో పాటు, కాలిఫోర్నియాలో తనను వెంబడిస్తున్నాడని, టెస్లా కారు ఫొటోలను తమ అనుమతి లేకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని, అతనో లైయర్ అని ఆన్​లైన్​ టెక్​ ఎడిటర్​కు మస్క్ ఫిర్యాదు చేశాడు. దీనికి కౌంటర్ వేస్తూ, 2019 ఆగస్టులో తన గౌరవానికి భంగం కలిగించాడంటూ మస్క్‌పై పరువునష్టం దావా వేశాడు రణ్‌దీప్. తాజాగా న్యాయస్థానం ఈ కేసుపై విచారణ జరిపింది. రణ్‌దీప్ చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని, అతను వేసిన పరువు నష్టం దావాను కొట్టివేయాల్సిందిగా న్యాయమూర్తి జస్టిస్​ జులియా స్పెయిన్‌ను మస్క్ అభ్యర్థించారు. మస్క్​ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చడంతో పాటు, రణ్‌దీప్ ఆరోపణలపై మరింత విచారణ జరగాలని తెలిపింది. ఇదిలా ఉంటే రణ్‌దీప్‌పై కోర్టు కేసు నడుస్తుండటంతో, గత ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు అతను టెస్లాపై ఒక్క ట్వీట్ చేయలేదు. కోర్టు తీర్పు రణ్‌దీప్‌కు అనుకూలంగా వస్తుందా? లేదా తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags:    

Similar News