కత్తిపోట్లకు గురైన యువతి హెల్త్ బులిటెన్ విడుదల.. ప్రస్తుతం యువతి ఆరోగ్యపరిస్థితి ఎలా ఉందంటే?

దిశ, ఎల్బీనగర్: ప్రేమోన్మాది చేతిలో కత్తిపోట్లకు గురైన యువతి హెల్త్ బులిటెన్ ను వైద్యులు విడుదల చేశారు. తీవ్ర గాయాలకు గురై యువతి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం యువతి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ఛాతి, పొట్ట భాగంలో రక్తస్రావం కావడంతో స్కానింగ్ తర్వాత సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని 24 గంటల తర్వాత పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుందని వైద్యులు తెలిపారు. రక్తస్రావమే […]

Update: 2021-11-11 03:53 GMT

దిశ, ఎల్బీనగర్: ప్రేమోన్మాది చేతిలో కత్తిపోట్లకు గురైన యువతి హెల్త్ బులిటెన్ ను వైద్యులు విడుదల చేశారు. తీవ్ర గాయాలకు గురై యువతి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం యువతి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ఛాతి, పొట్ట భాగంలో రక్తస్రావం కావడంతో స్కానింగ్ తర్వాత సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని 24 గంటల తర్వాత పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుందని వైద్యులు తెలిపారు. రక్తస్రావమే కాకుండా కడుపులో పిడిగుద్దులు గుద్దడంతో పరిస్థితి విషమంగా ఉందన్నారు. రక్తాన్ని కంట్రోల్ చేయడానికి రెండు గంటల టైం పట్టింది అని వైద్యులు తెలిపారు.

ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు బస్వరాజ్ ను రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రవేశపెట్టామని ఎల్బీనగర్ ఇన్ స్పెక్టర్ వి. అశోక్ రెడ్డి తెలిపారు. నిందితుడికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిందని వెల్లడించారు.

Tags:    

Similar News