ఆ కుటుంబానికి శాపంగా మారిన ‘విష జ్వరం’ ఒకరి తర్వాత ఒకరు
దిశ,మణుగూరు : విషజ్వరంతో బాలిక మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో చోటు చేసుకుంది. జిల్లాలోని గడ్డంపల్లి గ్రామంలో జాడి వీనిల (13) అనే బాలికకు గత 15 రోజుల నుంచి జ్వరం రావడంతో ఆమెను భద్రాచలం ప్రైవేట్ హాస్పిటల్ తరలించి వైద్యం చేయిస్తున్నారు. అయితే రాత్రికి రాత్రి వీనిల ఆరోగ్యం విషమించడంతో వరంగల్‌లోని ఎంజీఎం హాస్పిటల్‌కి తరలించారు. అక్కడ కూడా పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి 8గంటల సమయంలో వినీల మృతి […]
దిశ,మణుగూరు : విషజ్వరంతో బాలిక మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో చోటు చేసుకుంది. జిల్లాలోని గడ్డంపల్లి గ్రామంలో జాడి వీనిల (13) అనే బాలికకు గత 15 రోజుల నుంచి జ్వరం రావడంతో ఆమెను భద్రాచలం ప్రైవేట్ హాస్పిటల్ తరలించి వైద్యం చేయిస్తున్నారు. అయితే రాత్రికి రాత్రి వీనిల ఆరోగ్యం విషమించడంతో వరంగల్‌లోని ఎంజీఎం హాస్పిటల్‌కి తరలించారు. అక్కడ కూడా పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి 8గంటల సమయంలో వినీల మృతి చెందింది. అనంతరం కుటుంబసభ్యులు మృతదేహన్ని రాత్రికి రాత్రి గడ్డంపల్లి గ్రామానికి తీసుకువచ్చారు.
వివరాలలోకి వెళ్ళితే.. గడ్డంపల్లి గ్రామానికి చెందిన జాడి వెంకటేశ్వర్లు వెంకటమ్మకు ముగ్గురు సంతానం కలదు.గత కొంతకాలం ప్రమాదవశాత్తు వినీల అన్నయ్య విష జ్వరంతో మృతి చెందిన సంఘటన విదితమే. కొంతకాలం తరువాత వినీల తండ్రి వెంకటేశ్వర్లు కూడా విషజ్వరానికీ బలైపోయారు. కొడుకు, భర్త మృతి చెందడంతో వెంకటమ్మ తీవ్ర ఆవేదనకు గురైంది. ఇలా మనసులో ఆవేదన పడుతూ నిత్యం కూలి పని చేసుకుంటూ మిగిలిన ఇద్దరు ఆడపిల్లలతో జీవనం సాగిస్తుంది. ఇంతలోపే విషజ్వర మహమ్మారి వినీలను కూడా తల్లి నుండి దూరం చేసింది. కుటుంబంలో ముగ్గురు విషజ్వరాలతో మరణించడం ఆకుటుంబానికి ఎంతో ఆవేదన గురిచేసిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.వెంకటమ్మ కుటుంబానికి ఎవరైనా సహాయం చేసి ఆదుకోగలరని గ్రామస్తులు కోరారు.